Begin typing your search above and press return to search.
అమెరికాలో 'సీతారామం' సన్నివేశమేంటి?
By: Tupaki Desk | 3 Aug 2022 4:39 AM GMTఎంపిక చేసుకునే జానర్ ఏ వర్గం ఆడియెన్ కి చేరుతుంది? అనేది మేకర్స్ కి స్పష్టంగా తెలుసు. కథ ఎంపిక సమయంలోనే ట్రేడ్ ని విశ్లేషించుకుని మరీ బడ్జెట్లు పెడుతుంటారు. పలువురు హీరోలకు దేశ విదేశాల్లో ఉండే డిమాండ్ ని బట్టి కూడా కథాంశాలను ఎంపిక చేసుకుంటారు. దుల్కర్ ఇప్పుడు తెలివిగా అలాంటి మైండ్ గేమ్ ఆడుతున్నట్టు కనిపిస్తోంది.
మాలీవుడ్ లవర్ బోయ్ గా పాపులైన దుల్కార్ సల్మాన్ `ఓకే బంగారం`తో తెలుగు నాటా లవర్ బోయ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత మహానటి లో ఒక ప్రేమికుడిగానే నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. అతడు నటించిన మరో క్లాసిక్ లవ్ స్టోరి ఇప్పుడు మలయాళం సహా తెలుగు-హిందీ- తమిళంలోనూ విడుదలవుతోంది.
దుల్కర్ సల్మాన్- మృణాల్ ఠాకూర్- రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన `సీతా రామం` ఒక అద్భుత ప్రేమకథా చిత్రమని దుల్కార్ చెబుతున్నారు. ఈ మూవీ ఆగష్టు 5 న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ ఫుల్ ఫ్లోలో సాగిపోతున్నాయి.
ఇంతవరకూ చూడని పాయింట్ తో!
సీతారామం కథాంశం పూర్తి యూనిక్ గా ఉంటుందని కథనం రక్తి కట్టించేవిధంగా ఉంటుందని దుల్కార్ చెబుతున్నారు. ఈ సినిమా పెద్ద తెరపై గొప్ప ట్రీట్ గా నిలుస్తుందని నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ట్రైలర్ లో చూసింది చాలా చిన్నది. స్క్రీన్ ప్లే ఎంతో గిమ్మిక్ గా ఉంటుందని అదేమిటో తెరపైనే చూడాలని అంటున్నాడు. తన వయసుకు తగ్గట్టు మునుముందు ప్రేమకథల్లోనే కాకుండా విభిన్న చిత్రాల్లో నటించాలనుందని కూడా దుల్కార్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు.
అమెరికాలో మెప్పిస్తుంది:
తాజా సమాచారం మేరకు.. సీతా రామం అమెరికా థియేట్రికల్ రైట్స్ ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ ప్రకారం పెద్ద రేటు పలికిందని తెలిసింది. 700K డాలర్ల రేంజు లో డీల్ సాగిందని కూడా తెలుస్తోంది. అంటే దీనివిలువ సుమారు ఇండియన్ కరెన్సీలో రూ 5.5 కోట్లు. అంటే అమెరికా బాక్సాఫీస్ నుంచి మినిమంగా 6 కోట్లు పైగా వసూలు చేయాల్సి ఉంటుందని ట్రేడ్ విశ్లేషిస్తోంది. అయితే దుల్కార్ లాంటి హీరోకి ఇది పెద్ద టార్గెట్ అవుతుందన్న విశ్లేషణ కూడా సాగుతోంది.
సీతారామం అనేది క్లాసీ లవ్ డ్రామా.. ఇది USA ప్రేక్షకులకు బాగా సరిపోయే జానర్ కాబట్టి భారీ లక్ష్యంతో దుల్కార్ బరిలో దిగుతున్నాడని కూడా టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు జరగనుండగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఓకే బంగారం .. మహానటి చిత్రాలతో క్లాస్ పెర్ఫామర్ గా గుర్తింపు తెచ్చుకున్న దుల్కార్ ఇప్పుడు క్లాస్ లవ్ స్టోరి ఎమోషనల్ డ్రామా కథాంశంలో నటించారు. సీతారామం తెలుగు ఆడియెన్ లో ఏ మేరకు రీచ్ అవుతుందో చూడాలి.