Begin typing your search above and press return to search.

సీఎం జ‌గన్ తో నాగార్జున భేటీ వెన‌క గుట్టు లీక్

By:  Tupaki Desk   |   29 Oct 2021 5:54 AM GMT
సీఎం జ‌గన్ తో నాగార్జున భేటీ వెన‌క గుట్టు లీక్
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో నిన్న‌టిరోజున (గురువారం) కింగ్ నాగార్జున భేటీ పై ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ర‌క‌ర‌కాల ఊహాగానాలు సాగాయి. సినీప‌రిశ్ర‌మ స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్థావించేందుకే సీఎం జ‌గ‌న్ ని క‌లిసార‌ని అంతా భావించారు. ఆన్ లైన్ టిక్కెట్ల పోర్టల్ .. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టిక్కెట్ ధరల సమస్యపై చర్చించడానికి నాగార్జున జగన్ తో సమావేశమయ్యారని ఊహాగానాలు వైర‌ల్ అయ్యాయి.

అయితే ఈ సమావేశం దేని గురించి..? అన్న‌దానికి ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని క్లారిటీనిచ్చే ప్ర‌య‌త్నం చేశారు. దీని వెనుక ఎటువంటి రహస్య ఉద్దేశాలు లేవని ఆయ‌న‌ అన్నారు. ``జగన్ .. నాగార్జున మంచి స్నేహితులు .. శ్రేయోభిలాషులు. ఇది సాధారణ సమావేశం మాత్రమే. అంతకు మించి ఏమీ లేదు. టాలీవుడ్ గురించి నాగార్జున ఏదైనా చెప్పాలంటే నన్ను కలిసి చెబుతున్నారు. జగన్ తో ఇది తన వ్యక్తిగత భేటీ మాత్ర‌మే`` అని పేర్ని నాని అన్నారు.

అయితే సినిమా టిక్కెట్ రేట్ల అంశం అగ్ర నిర్మాత‌లంద‌రికీ పెను స‌మ‌స్య‌గా మారింది. నిరంత‌రం సొంత బ్యాన‌ర్ లో సినిమాలు తీస్తూ నాగార్జున చాలా రిస్కులే చేస్తున్నారు. అందువ‌ల్ల ఆయ‌న టిక్కెట్టు ధ‌ర‌ల పెంపుపై మాట్లాడ‌కుండా ఉండ‌రు.. అని అంతా భావిస్తున్నారు.

ప్ర‌భుత్వ పోర్ట‌ల్ లోనే టిక్కెట్ల అమ్మ‌కం

ఇక‌పై ప్ర‌భుత్వ పోర్ట‌ల్ లోనే ప్రేక్ష‌కులు టిక్కెట్లు కొని సినిమా థియేట‌ర్ కి వెళ్లాలి. ఆ మేర‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం గురువారం నాడు సమావేశమై అనేక కీలక నిర్ణయాల గురించి చర్చించింది. ఆంధ్ర ప్రభుత్వంచే నిర్వహించబడే కొత్త సినిమా టికెటింగ్ పోర్టల్ పై క్లారిటీ నిచ్చింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది. త్వరలో పోర్టల్ అమల్లోకి వస్తుంది. టిక్కెట్ విక్రయాల గురించిన కొత్త మార్గదర్శకాలతో పాటు కొత్త టిక్కెట్ ధర జీవో అతి త్వరలో విడుదల కానున్నాయి. ప్ర‌భుత్వ పోర్ట‌ల్ ఆమోద‌యోగ్యమేనా కాదా? అన్న‌దానిపై ఏపీ మంత్రి పేర్ని నాని సినీపెద్ద‌ల‌తో చ‌ర్చించిన సంగ‌తి తెలిసిందే. ఏపీలో టిక్కెట్ల పోర్టల్ గురించి ఆయ‌న అభిప్రాయాన్ని సేకరించారు. దీనికి నిర్మాత‌ల నుంచి మ‌ద్ధ‌తు ల‌భించింది. ఇక‌పోతే కేబినెట్ లో సినిమా టిక్కెట్లకు సంబంధించిన కొత్త టిక్కెట్టు ధ‌ర ప‌రిశీల‌న‌కు ఆమోదం ల‌భించ‌డం నిర్మాత‌ల‌కు ఊర‌ట‌గా భావిస్తున్నారు.