Begin typing your search above and press return to search.
గేరు మార్చిన సీనియర్ హీరోయిన్ జోరు పెంచేసింది!
By: Tupaki Desk | 22 March 2021 12:30 AM GMTకాలం చాలా చిత్రమైంది .. అది ఎప్పుడు వెలివేస్తుందో .. ఎప్పుడు గెలిపిస్తుందో ఎవరికీ తెలియదు. అందుకే ఏది జరిగినా కాలమహిమ అనుకుంటూ ఉండటం చూస్తుంటాము. అలా ఒకప్పుడు కాలం కలిసిరాకపోవడం వలన వెనకబడిపోయిన ప్రియమణికి ఇప్పుడు కాలం కలిసొచ్చింది .. అందువల్లనే ఒక రేంజ్ లో అవకాశాలను అందుకుంటూ వెళుతోంది. ఆమె రొట్టె విరిగి నేతిలో కాదు .. ఏకంగా తేనెలోనే పడిపోయింది. అందువల్లనే చాలా అరుదైన పాత్రలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి .. అదీ స్టార్ హీరోల కాంబినేషన్లో కావడం విశేషం.
తెలుగులో ప్రియమణి చాలా సినిమాలే చేసినా, వాటిలో 'యమదొంగ' మొదటిస్థానంలో కనిపిస్తుంది. ఇక ఆమె ప్రధానమైన పాత్రను పోషించిన 'క్షేత్రం' .. ప్రియమణి నటనకు కొలమానంగా నిలుస్తుంది. ఆ తరువాత ఆమె ఇక్కడ చెప్పుకోదగిన సినిమాలు చేయలేకపోయింది. సాధారణంగా తెలుగులో అవకాశాలు తగ్గినప్పుడు హీరోయిన్లు కోలీవుడ్ బాట పడుతుంటారు. కానీ ప్రియమణి అందుకు భిన్నంగా కన్నడ .. మలయాళ సినిమాలు చేసుకుంటూ వెళ్లింది. అక్కడ ఆమె కెరియర్ మూడు హిట్లు .. ఆరు ఫ్లాట్లు అన్నట్టుగా సాగుతోంది.
హీరోయిన్ గా అవకాశాలు తగ్గడం వలన తెలుగు తెరకి దూరమైన ప్రియమణికి ఇప్పుడు కాలం కలిసి వచ్చినట్టుగానే కనిపిస్తోంది. రానా కథానాయకుడిగా రూపొందిన 'విరాటపర్వం' సినిమాలో ఆమె 'కామ్రేడ్ భరతక్క'గా కీలకమైన పాత్రను పోషించింది. ఇక గ్రామీణ నేపథ్యంలో నిర్మితమైన 'నారప్ప' సినిమాలో, వెంకటేశ్ భార్యగా కనిపించనుంది. ఈ రెండూ కూడా విలక్షణమైన పాత్రలే. ఇక ఆమె నటించిన హారర్ మూవీ 'సిరివెన్నెల' కూడా విడుదలకు ముస్తాబవుతోంది. యంగ్ హీరోల తల్లి పాత్రలకు .. వదిన పాత్రలకు ఆమెను అడుగుతున్న దర్శక నిర్మాతల సంఖ్య ఎక్కువగానే ఉందట. మరో రెండు మూడు తెలుగు సినిమాలకి ఆల్రెడీ ఆమె సైన్ చేసిందనే టాక్ వినిపిస్తోంది. ప్రియమణికి టైమ్ కలిసొచ్చిందనడానికి ఇంతకంటే నిదర్శనాలేం కావాలి?