Begin typing your search above and press return to search.
వ్యాక్సిన్ తీసుకున్న సీనియర్ హీరోయిన్
By: Tupaki Desk | 24 March 2021 3:30 AM GMT60 సంవత్సరాలు దాటిన వారు సుదీర్ఘ కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు.. దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు ఉన్న వారు కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలంటూ ఇప్పటికే కేంద్రం సూచించిన నేపథ్యంలో పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. 60 ఏళ్లు దాటిన ప్రముఖులతో పాటు కొందరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు కూడా వ్యాక్సిన్ ను తీసుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చారు. తాజాగా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కూడా కరోనా వ్యాక్సిన్ ను తీసుకున్నారు.
సోషల్ మీడియా లో రమ్యకృష్ణ కరోనా వ్యాక్సిన్ ను తీసుకున్న ఫొటోను షేర్ చేశారు. ఆమె ఈ సందర్బంగా ప్రతి ఒక్కరు కూడా నమ్మకంగా కరోనా వ్యాక్సిన్ ను తీసుకోవాలంటూ సూచించారు. మొదటి డోసు తీసుకున్న రమ్యకృష్ణ రెండవ డోసును నిర్ణీత కాల వ్యవధి తర్వాత తీసుకోబోతున్నారు. 50 ఏళ్ల రమ్యకృష్ణ కరోనా వ్యాక్సిన్ ను తీసుకుని అందరికి ఆదర్శంగా నిలిచారు. వ్యాక్సిన్ అంటే భయపడుతున్న వారు నిర్భయంగా వ్యాక్సిన్ ను తీసుకోవాలంటూ ప్రముఖులు వ్యాక్సిన్ తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అవైర్ నెస్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇది నిజంగా అభినందనీయం. రమ్యకృష్ణ నటిగా ప్రస్తుతం పలు భాషల్లో బిజీ గా ఉన్నారు. ఈ క్రమంలో ఆమె ఎంతో మందిని కలుస్తూ ఉంటారు. అందుకే ఆమె కరోనా బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక వ్యాక్సిన్ తీసుకోవడం మంచి నిర్ణయం అంటూ సన్నిహితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.