Begin typing your search above and press return to search.

వీడియో: జాన్వీ ట్రెండ్స్ వెన‌క షాడో అత‌డే

By:  Tupaki Desk   |   13 Nov 2021 12:30 AM GMT
వీడియో: జాన్వీ ట్రెండ్స్ వెన‌క షాడో అత‌డే
X
ధ‌డ‌క్ చిత్రంతో శ్రీ‌దేవి న‌టవార‌సురాలిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ క‌పూర్ సినీవినీలాకాశంలో తారా జువ్వ‌లా దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. అయితే జాన్వీ ఇంత స్పీడ్ చూపించ‌డం వెన‌క వాస్త‌విక స్ట్రాట‌జీ సాటి న‌ట‌వార‌సులనే గాక ఇత‌ర ఔత్సాహిక తార‌ల్ని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

తండ్రి గ్రేట్ నిర్మాత‌ బోనీక‌పూర్ పర్ఫెక్ట్ ప్లానింగ్ దీనివెన‌క ఉంది అంటే అతిశయోక్తి కాదు. ఇక జాన్వీ క‌పూర్ నిరంత‌రం వ‌ర‌స ఫోటోషూట్ల‌తో అంత‌ర్జాలంలో చెల‌రేగుతూ యూత్ కంటికి కునుకుప‌ట్ట‌నివ్వ‌ని ట్రీట్ ఇస్తోంది. ఓవైపు బోనీ క‌పూర్ .. త‌న కుమార్తెకు క‌ర‌ణ్ జోహార్- మ‌నీష్ మ‌ల్హోత్రా స‌హా దిగ్గ‌జాలంటి టాప్ డైరెక్ట‌ర్స్ ప్రొడ్యూస‌ర్స్ తో ప‌ని చేసేందుకు అవ‌స‌ర‌మైన అన్ని ర‌కాల విధానాల్ని సెట‌ప్ చేయ‌డం అది పెద్ద రేంజులో వ‌ర్క‌వుట్ కావ‌డం క‌నిపిస్తోంది.

గ‌త రెండేళ్లుగా జాన్వీ కెరీర్ ప‌రంగా ఫాలోయింగ్ ప‌రంగా ప‌దింత‌లు షైన్ అయ్యింది అంటే ఇది మార్కెటింగ్ ప‌రంగా ఎంచుకున్న ఫార్ములా అనే చెప్పాలి. ఇక జాన్వీ వెన‌క దిగ్గ‌జ‌మంటి మ‌నీష్ మ‌ల్హోత్రా ఫ్యాష‌న్ డిజైనింగ్ స్కిల్ కూడా బ‌లంగా ఉంద‌నడంలో ఎలాంటి సందేహం లేదు. ర‌క‌ర‌కాల వెరైటీ డిజైన‌ర్ దుస్తుల్లో వ‌రుస ఫోటోషూట్ల‌తో జాన్వీ దుమారం రేపుతోందంటే ఆ వెన‌క ఫ్యాష‌న్ దిగ్గ‌జం కృషిని విస్మ‌రించ‌లేం. తాజాగా మ‌నీష్ మ‌ల్హోత్రా డిజైన‌ర్ లుక్ కి సంబంధించిన ఓ వీడియోని జాన్వీ షేర్ చేయ‌గా అది అంత‌ర్జాలంలో దుమ్మురేపుతోంది. ప్ర‌ఖ్యాత హ‌లో మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీ షూట్ సంచ‌ల‌నంగా మారింది. ఈ ఫోటోషూట్ లో జాన్వీ అంద‌చందాలు ఒక రేంజులో హైలైట్ అయ్యాయి. చూడ‌గానే మ‌త్స్య‌క‌న్య‌నే త‌ల‌పించేంతగా అల్ట్రా రిచ్ డిజైన‌ర్ లుక్ మైండ్ ని బ్లాక్ చేస్తుంది. జాన్వీ త‌దుప‌రి క‌ర‌ణ్ నిర్మిస్తున్న దోస్తానా 2 స‌హా ప‌లు భారీ చిత్రాల్లో న‌టిస్తోంది.