Begin typing your search above and press return to search.

షూటింగ్ ల బంద్‌.. రిలీజ్ డేట్ ల ప‌రిస్థితేంటీ?

By:  Tupaki Desk   |   27 July 2022 1:30 PM GMT
షూటింగ్ ల బంద్‌.. రిలీజ్ డేట్ ల ప‌రిస్థితేంటీ?
X
టాలీవుడ్ లో గ‌త కొన్ని నెల‌లుగా స్టార్ ప్రొడ్యూస‌ర్ల‌కు ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు ఎదుర‌వుతున్నాయి. క‌రోనా కార‌ణంగా షూటింగ్ లు వాయిదా ప‌డ‌టంతో అప్ప‌టి వ‌ర‌కు పెట్టిన పెట్టుబ‌డుల‌పై వ‌డ్డీలు పెరిగిపోయాయి. అంతే కాకుండా సినిమా నిర్మాణ వ్య‌వ‌యం కూడా గ‌ణ‌నీయంగా పెర‌గ‌డంతో నిర్మాత‌లు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు టికెట్ రేట్లు పుర‌గ‌డం, స్టార్ హీరోల‌, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ ల పారితోషికాలు పెరిగిపోవ‌డంతో నిర్మాణ వ్య‌యం త‌డిసిమోపెడ‌వుతోంది.

ఇక ఓటీటీల కార‌ణంగా కూడా థియేట‌ర్ వ్య‌వ‌స్థ దారుణంగా దెబ్బ‌తింది. ఈ స‌మ‌స్య‌ల‌తో పాటు ఫెడ‌రేష‌న్, మేనేజ‌ర్ల స‌మ‌స్య‌లు కూడా త‌ల‌పోటుగా మార‌డంతో ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ మెండ‌ర్స్ ఫైన‌ల్ గా ఆగ‌స్టు 1 నుంచి సినిమా బంద్ కు పిలుపునిస్తూ మంగ‌ళ‌వారం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ నిర్ణ‌యం కార‌ణంగా చాలా వ‌ర‌కు భారీ చిత్రాల షూటింగ్ ల ప‌రిస్థితి ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.

అంతే కాకుండా వీటి రిలీజ్ ల ప‌రిస్థితి కూడా అమోమ‌యంగా మారబోతున్న‌ట్టుగా తెలుస్తోంది. ఇప్ట‌పికే కొన్ని సినిమాలు రిలీజ్ డేట్ ల‌ని ప్ర‌క‌టించేశాయి కూడా. షూటింగ్ ల బంద్ కార‌ణంగా అనుకున్న స‌మ‌యానికి నిర్మాణం పూర్తి కాని ప‌క్షంలో రిలీజ్ డేట్ లు మారే ప్ర‌మాదం వుంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లోనే ప్ర‌క‌టించిన డేట్ ల‌కు సినిమాల‌ని రెడీ చేయ‌డం ఇబ్బందిగా మారిన నేప‌థ్యంలో స‌డ‌న్ గా గిల్డ్ ప్రొడ్యూస‌ర్స్ బంద్ కు పిలుపు నివ్వ‌డం ప‌లు సినిమాల షూటింగ్ ల‌కు త‌ల‌నొప్పిగా మారిన‌ట్టు తెలుస్తోంది.

షూటింగ్ లు ఆప‌డం వ‌ల్ల న‌ష్ట‌పోయేది నిర్మాతే. హీరోలు, న‌టీన‌టులు, టెక్నీషియ‌న్ ల కాల్షీట్ ల‌కు మ‌ళ్లీ డ‌బ్బులు క‌ట్టాల్సి వుంటుంది. ఇచ్చిన డేట్ లు పూర్త‌యిపోతే మ‌రిన్ని డేట్ లు అవ‌స‌రం వుంటుంది. ఇందుకు ఖ‌చ్చితంగా హీరోలు, న‌టీన‌టులు, టెక్నీషియ‌న్ డ‌బ్బులు డిమాండ్ చేయ‌డం కామ‌న్‌. ఇది నిర్మాత‌ల‌కు మ‌రో భారంగా మారే అవ‌కాశం వుంది. షూటింగ్ ల కోసం స్టూడియోల‌కు, అవుట్ డోర్ యూనిట్ ల‌కు ఇచ్చిన అడ్వాన్స్ లు న‌ష్ట‌పోయే ప్ర‌మాదం కూడా వుంది.

ఆగ‌స్టు లో షూటింగ్ ప్రారంభించి వ‌చ్చే ఏడాది సంక్రాంతి విడుద‌ల చేయాల‌నుకుంటున్న మ‌హేష్ - త్రివిక్ర‌మ్ ప్రాజెక్ట్ ల‌కు గిల్డ్ నిర్ణ‌యం శాపంగా మారే అవ‌కాశాలే ఎక్కువ‌గా వున్నాయి. ఇక ఇప్ప‌టికే దాదాపుగా షూటింగ్ పూర్త‌యి ఫైన‌ల్ స్టేజ్ లో వున్న `గాడ్ ఫాద‌ర్‌` లాంటి సినిమాల‌కు కూడా రిలీజ్ డేట్ ప‌రంగా ఇబ్బందిగా మార‌డం కాయం అని చెబుతున్నారు. బంద్ కొలిక్కి వ‌స్తే ఓకే కానీ సినిమాల రిలీజ్ డేట్ లు ఇబ్బందిలో ప‌డ‌తాయి.

అంతే కాకుండా సినిమా నిర్మాణంపై ఆధార‌ప‌డి వున్న కార్మికులు రోడ్డున ప‌డాతారు. ఇలాంటిఇబ్బందులు త‌లెత్త‌కూడ‌దంటే ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్‌, నిర్మాత‌ల మండ‌లి క‌లిసి స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం స‌మిష్టిగా ప‌ని చేయాల్సిన అవ‌స‌రం ఎంతో వుంది.