Begin typing your search above and press return to search.

ఆస్కార్ రేసులో బిట్టు.. జల్లికట్టుకు నిరాశ!

By:  Tupaki Desk   |   10 Feb 2021 2:04 PM GMT
ఆస్కార్ రేసులో బిట్టు.. జల్లికట్టుకు నిరాశ!
X
ఈ ఏడాది జరగనున్న 93వ ఆస్కార్ అవార్డుల నామినేషన్స్ లో రోజురోజుకి ఉత్కంఠ రేపుతున్నాయి. ఇండియా తరపున మలయాళం ఫిల్మ్ జల్లికట్టు, తమిళ సినిమా ఆకాశం నీ హద్దురా సినిమాలు ఆస్కార్‌కు నామినేట్ అయ్యాయి. కానీ ఆస్కార్ బరిలో అవి నిలబడలేదు. తాజాగా ఆస్కార్ బరి నుంచి జల్లికట్టు తప్పుకుంది. అలాగే ఆస్కార్ తొమ్మిది కేటగిరిలో షార్ట్ లిస్ట్ చేసిన చిత్రాలను ప్రకటించారు. ఈసారి ఇండియా నుండి బిట్టు అనే షార్ట్ ఫిలిం ఆస్కార్‌కు షార్ట్ లిస్ట్ అయింది. మహిళా సాధికారిత, వారికి ఎదురయ్యే సమస్యలపై పోరాటం చేయడం, ఇద్దరు స్కూల్ పిల్లలు, స్నేహితుల మధ్య జరిగే పరిస్థితుల చుట్టూ ఈ షార్ట్ ఫిల్మ్ నడుస్తుంది. ఆస్కార్ బరిలో లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం కేటగిరీలో బిట్టు షార్ట్ లిస్ట్ అయింది. కరిష్మా దేవ్ దూబే దర్శకురాలిగా పరిచయమైన ఈ లఘుచిత్రంను ఏక్తా కపూర్, గునీత్ మోంగా, తాహీర్ కశ్యప్ సంయుక్తంగా నిర్మించారు.

ఎంతో ఆశలతో ఆస్కార్ బరిలో నిలిచిన ‘జల్లికట్టు’ సినిమా చివరి వరకు అర్హత పొందలేకపోయింది. ఆస్కార్ అవార్డుల కోసం ఈ ఏడాది ఇండియా నుండి 27 సినిమాలు ఎంపికవగా.. అందులో మలయాళ ‘జల్లికట్టు’ సినిమాను ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసింది. ఉత్తమ లైవ్ యాక్షన్ లఘుచిత్రం విభాగంలో ‘బిట్టు’..తర్వాతి రౌండుకు ఎంపికైంది. ఈ విషయాన్ని బుధవారం అధికారిక ప్రకటన వెలువడింది. అయితే డైరెక్టర్ జోస్ పెల్లీస్సరీ ‘జల్లికట్టు’ సినిమాను తెరకెక్కించాడు. ఈ మూవీ 2019 టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‏లో విమర్శకుల నుండి ప్రశంసలు పొందింది. ఉత్తమ దర్శకుడిగా జోస్ పెల్లీస్సరీ అవార్డు కూడా అందుకున్నాడు. కసాయి కొట్టు నుంచి తప్పించుకున్న దున్నపోతు ఆ చుట్టుపక్కల ఎలాంటి కల్లోలం రేపిందనే కథాంశంతో జల్లికట్టు రూపొందింది. మొత్తానికి ఈ ఏడాది ఇండియన్ సినిమాలకి ఆస్కార్ వద్ద నిరాశే మిగిలింది.