Begin typing your search above and press return to search.
ఉక్రెయిన్ పరిస్థితి భయానకం: ప్రియాంక చోప్రా
By: Tupaki Desk | 25 Feb 2022 5:30 PM GMTఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా రష్యా - ఉక్రెయిన్ మధ్య చోటు చేసుకున్న యుద్ధ వాతావరణం గురించే మాట్లాడుకుంటున్నాయి. రష్యా దళాలు ఉక్రెయిన్ లోకి చొచ్చుకుని వెళుతున్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్ లోని ప్రధానమైన నగరాలను ఆక్రమించినట్టుగా వార్తలు వస్తున్నాయి.
ఇక రష్యా బలగాలు జరుపుతున్న బాంబు దాడులకు ఉక్రెయిన్ ఉలిక్కిపడుతోంది. రష్యా యుద్ధ విమానాలను కూల్చి వేస్తున్నట్టుగా ఉక్రెయిన్ చెప్పుకుంటూ ఉంటే, ఉక్రెయిన్ సైనికులు చాలామంది ప్రాణాలు కోల్పోయినట్టుగా రష్యా ప్రచారం చేస్తోంది.
మొత్తానికి ఉక్రెయిన్ లో ఎక్కడివారు అక్కడ ఉండిపోయారు. బయటికి వచ్చే పరిస్థితి లేదు. అలా అని చెప్పేసి తలదాచుకున్న ప్రదేశం భద్రమని అనుకోలేరు. కొందమంది అండర్ గ్రౌండ్ బంకర్లలో .. మరి కొంతమంది అండర్ గ్రౌండ్ రైల్వే సబ్ స్టేషన్లలో తలదాచుకున్నారు. ఇక వివిధ దేశాలకి చెందినవారు ఎంతో మంది అక్కడి నుంచి బయటపడే మార్గం లేక, తమ కుటుంబ సభ్యులకు పంపుతున్న వీడియోస్ చూస్తే అక్కడి పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయనేది తెలుస్తోంది.
తాజాగా ఈ పరిస్థితులను గురించి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా స్పందించింది. " ఉక్రెయిన్ లో పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. ఎంతోమంది ప్రజలు తమ ప్రాణాలను ఉగ్గ బట్టుకుని అక్కడ బ్రతుకుతున్నారు.
ఎవరికి వారు తమ కుటుంబ సభ్యులను కాపాడుకోవడం కోసం ఆరాటపడుతున్నారు. తమ వారి ప్రాణాలకు హాని కలుగు తుందేమోనని ఆందోళన చెందుతున్నారు. ప్రాణాలను కాపాడుకోవడమే ఇప్పుడు అక్కడున్నవారి ముందున్న పెద్ద ప్రశ్నగా మారిపోయింది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియని ఒక భయానక పరిస్థితి.
ఆధునిక ప్రపంచం పై ఈ విపత్తు తప్పకుండా తన ప్రభావం చూపుతుంది. ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా ఈ యుద్ధం యొక్క పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువలన ఈ విషయంపై ప్రతి ఒక్కరూ స్పందించవలసిన అవసరం ఉంది. ఈ యుద్ధ భూమిలో నాలాంటి .. మీ లాంటి ప్రజలు ఎంతోమంది బ్రతుకుతున్నారు. రండి .. ఉక్రెయిన్ ప్రజలకు సాయం చేద్దాం " అంటూ రాసుకొచ్చింది.