Begin typing your search above and press return to search.
దర్శకురాలిగా మారిన స్టార్ హీరోయిన్..!
By: Tupaki Desk | 14 April 2021 6:04 AM GMTటాలీవుడ్ హీరోయిన్ రాధికా ఆప్టే.. తొలి సినిమా 'లెజెండ్'తోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. రాధికా అంటే ఇటు క్లాస్ క్యారెక్టర్స్ చేయగలదు. అలాగే బోల్డ్ క్యారెక్టర్స్ కూడా చేయగలదని నిరూపించుకుంది. ఇండస్ట్రీతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తోంది రాధికా. అయితే ఇంతకాలం హీరోయిన్ గా అలరించిన రాధికా.. ఈసారి దర్శకురాలిగా అలరించనుంది. ఎలాగో నటిగా సక్సెస్ అయింది కాబట్టి ఇకపై దర్శకత్వంలో అదృష్టం ఎలా ఉందో చూసుకోనుంది. ఇటీవలే నేచర్ మీద కాన్సెప్ట్ తయారు చేసుకొని 30 నిమిషాల షార్ట్ ఫిల్మ్ తెరకెక్కించింది అమ్మడు. రాధికా డైరెక్షన్ అనేసరికి సోషల్ మీడియాలో ఆమె గురించి చర్చలు మొదలయ్యాయి.
ఇదివరకే రాధికా తను తెరకెక్కించిన షార్ట్ ఫిల్మ్ ట్రైలర్ పామ్స్ స్ప్రింగ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించింది. షహానా గోస్వామి, గుల్షన్ దేవయ్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ షార్ట్ ఫిల్మ్ కు 'స్లీప్ వాకర్' అనే టైటిల్ పెట్టింది. భార్య భర్తల మధ్య జరిగే సంభాషణతో ట్రైలర్ ఆసక్తికరంగా మొదలైంది. నిద్రలో నడిచే నీ అలవాటు గురించి నీకు తెలుసా అని గుల్షన్.. షహానాను ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదంటూ ఆమె కొట్టిపారేస్తుంది. అయితే ప్రతిరోజూ రాత్రి కాగానే ఓ బాలిక వాళ్లింటికి రావడం.. ఆమెతో కలిసి షహానా బీచ్‌కు వెళ్లడం.. అక్కడి నుంచి ఆ బాలిక తనను సముద్రంలోకి తీసుకువెళ్లడం వంటి దృశ్యాలు ఉత్కంఠత కలిగించాయి.
ట్రైలర్ చివరలో.. షహానా ముఖానికి ప్లాస్టిక్ కవర్ చుట్టి.. ‘‘ఐ యామ్ సారీ’’ అంటూ గుల్షన్ ఆమెను చిత్రహింసలకు గురిచేసే సీన్లు ఆసక్తిగా ఉన్నాయి. ఈ షార్ట్ ఫిల్మ్ లో మానవుడికి వాతావరణానికి గల ఒక స్పెషల్ రిలేషన్ ని హైలెట్ గా చూపించబోతున్నట్లు నిర్మాతలు తెలిపారు. అయితే తాజాగా రాధికా మాట్లాడుతూ.. "నేనెప్పుడూ డైరెక్షన్ చేయాలనీ అనుకోలేదు. కానీ ఈ 'స్లీప్ వాకర్' స్క్రిప్ట్ రాసాక నటించడం కంటే డైరెక్షన్ చేయాలనీ ఇంటరెస్ట్ కలిగింది. కానీ ఈ షార్ట్ ఫిల్మ్ తీసాక డైరెక్షన్ పై ఇష్టం ఏర్పడింది" అని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం రాధికా 'శ్రీమతి అండర్కవర్' సినిమాలో నటిస్తుంది.