Begin typing your search above and press return to search.
'మహాసముద్రం' థీమ్ మొత్తాన్ని ఆ పాట తెలియజేస్తుంది: శర్వా
By: Tupaki Desk | 8 Sep 2021 2:30 AM GMTఅజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ - బొమ్మరిల్లు సిద్ధార్థ్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ''మహా సముద్రం''. ఇందులో అదితిరావు హైదరీ - అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ చేస్తున్న మేకర్స్.. ఇటీవలే సినిమాలోని 'చెప్పకే చెప్పకే' అనే పాటని విడుదల చేశారు.
చైతన్ భరద్వాజ్ స్వరపరిచిన ఈ గీతానికి చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించగా.. దీప్తి పార్థసారథి ఆలపించారు. 'చెప్పకే చెప్పకే ఊసుపోని మాటలు.. చాలులే వేళాకోళం ఉరుకు.. నేర్పకే నేర్పకే లేనిపోని ఆశలు.. మనసా మళ్ళీరాకు వెళ్లిపో..' అంటూ సాగిన ఈ మెలోడీ సాంగ్ శ్రోతలను విశేషంగా అలరిస్తోంది. ఈ పాట యూట్యూబ్ లో 1.7 మిలియన్ల వ్యూస్ తో ప్రస్తుతం ట్రెండింగ్ లో కొనసాగుతోంది. తాజాగా హీరో శర్వానంద్ ఈ పాట విశేషాలను వెల్లడించారు.
'చెప్పకే చెప్పకే' సాంగ్ 'మహాసముద్రం' సినిమా థీమ్ మొత్తాన్ని తెలియజేస్తుంది. లిరిక్స్ చాలా టచింగ్ గా ఉంటాయి. ఈ పాటకు స్వర్ణ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఇందులో మణిరత్నం స్టూడెంట్స్ అయిన అదితి రావు హైదరి - శరణ్య మేడమ్ ఉన్నారు. అసలు సినిమా ఎంటనేది ఈ సాంగ్ లో చూపించారు. ఈ పాట సోల్ ఆఫ్ ది ఫిల్మ్. వైజాగ్ లో దీన్ని షూట్ చేశాం. ఇది నా ఫేవరేట్ సాంగ్. దీనికి చైతన్ భరద్వాజ్ అమేజింగ్ ట్యూన్ ఇచ్చారు. చైతన్య ప్రసాద్ బ్యూటిఫుల్ లిరిక్స్ రాశారు. ఈ పాటలో ప్రతీ చిన్న అంశాన్ని కూడా అజయ్ భూపతి చాలా డీటైలింగ్ గా డిజైన్ చేశారు అని శర్వానంద్ చెప్పుకొచ్చారు.

ప్రేమ, యాక్షన్ అంశాలతో కూడిన డ్రామాగా ''మహాసముద్రం'' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రాజ్ తోటా సినిమాటోగ్రఫీ అందించగా.. ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. కొల్లా అవినాష్ ప్రొడక్షన్ డిజైనర్. ఈ చిత్రంలో జగపతి బాబు - రావు రమేష్ - గరుడ రామ్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని కలిగించింది. సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.