Begin typing your search above and press return to search.

వేగం జెట్ స్పీడ్ ని మించింది కానీ ఉప‌యోగ‌మేమి?

By:  Tupaki Desk   |   28 Sep 2022 8:30 AM GMT
వేగం జెట్ స్పీడ్ ని మించింది కానీ ఉప‌యోగ‌మేమి?
X
సాయికుమార్ వార‌సుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఆది ఇంకా నిల‌దొక్కుకునే పోరాటం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టివ‌ర‌కూ చాలా సినిమాలు చేసాడు. కానీ కెరీర్ ప‌రంగా చెప్పుకోద‌గ్గ స‌క్సెస్ ఏదైనా ఉందా? అంటే అది 'ప్రేమ క‌వాలి' ల‌వ్లీ త‌ప్ప మ‌రో సినిమా క‌నిపించ‌లేదు. ఈ రెండు కెరీర్ ఆరంభంలో వ‌చ్చిన విజ‌యాలు. ఆ త‌ర్వాత చాలా సినిమాలు చేసాడు.

కానీ చెప్పుకోద‌గ్గ విష‌యం ఎక్క‌డా క‌నిపించ‌లేదు. ద‌శాబ్ధం దాటినా ఇంకా పోరాటం చేసే ద‌శ‌లోనే ఉన్నాడు. అన్ని ర‌కాలుగా సినిమాకి ఫిట్ అయ్యే న‌టుడే అయినా? ఎక్క‌డో త‌ప్పిదాలు ఆయ‌న్ని వెన‌క్కి లాగుతున్నాయి. ఇటీవ‌లే 'తీస్మార్ ఖాన్' సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. సినిమా ప‌ర్వాలేద‌నిపించింది. కానీ త‌క్కువ థియేట‌ర్ల‌లో రిలీజ్ అవ్వ‌డంతో అంత‌రీ చ్ ద‌క్క‌లేదు.

రిలీజ్ ప్లానింగ్ స‌రిగ్గా లేక‌పోవ‌డం ఆ సినిమాకి మైన‌స్ అయింది. ప్రస్తుతం యంగ్ హీరో చేతిలో ఐదారు సినిమాలున్నాయి. అన్ని సెట్స్ లో ఉన్నాయి. వాటిలో ఏ సినిమా లో ఎంత స్ట‌ప్ ఉంద‌న్న‌ది రిలీజ్ త‌ర్వాత గానీ క్లారిటీ రాదు. త్వ‌ర‌లో 'క్రేజీ ఫెలో' చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. అక్టోబ‌ర్ 14న చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో ప్ర‌చార చిత్రాల‌తో హైప్ తీసుకొచ్చే ప‌నుల్లో టీమ్ నిమ‌గ్న‌మైంది. ఇదే మూవ్ మెంట్ లో మ‌రో సినిమా ప్ర‌చారం ప‌నులు కూడా మొద‌లు పెట్టాల‌ని ఆది భావిస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. 'సీఎస్ ఐ స‌నాత‌న్' అనే ఓ సినిమాలో న‌టిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా టీజ‌ర్ విడుద‌లైంది. టీజ‌ర్ చూస్తుంటే హిట్ సినిమా నుంచి ప్రేర‌ణ పొందిన‌ట్లు క‌నిపిస్తుంది.

కాపీ క్యాట్ అనే ప్ర‌చారం సాగుతోంది. ఇలా రెండు సినిమాల ప్ర‌చారం ఒకేసారి తెర‌పైకి తీసుకురావ‌డం విమ‌ర్శ‌ల్ని తెచ్చిపెడుతుంది. దీంతో ఆది సినిమాల విష‌యంలో తొంద‌ర‌ప‌డుతున్నాడా? అన్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

ఇంకా ఆది లైన‌ప్ లో మ‌రో మూడు సినిమాలున్నాయి. అవి సెట్స్ లో ఉన్నాయి. వాటిని ఇదే త‌ర‌హాలో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తారా? అన్న‌ది చూడాలి. దీంతో నిక్క‌మైన నీలం మొక్క‌టిచాలు ..త‌ళు కుబెళుకు రాళ్లు త‌ట్ట‌డేలా? అన్న ప‌ద్యాన్ని పాడుకోవ‌డం నెటి జ‌నులు వంత్తైంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.