Begin typing your search above and press return to search.
స్టార్ డైరెక్టర్ కొరటాల స్కూలు మార్చారు
By: Tupaki Desk | 23 April 2022 11:30 AM GMTటాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరో అయినా.. స్టార్ డైరెక్టర్ అయినా ఏడాదికి మొక్కుబడిగా ఒకే ఒక్క సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేవారు. అదే పదివేలు అనుకునే వారు ప్రేక్షకులు, అభిమానులు.. కానీ ట్రెండు మారింది ఇప్పడు ఒక్క సినిమా చేస్తే సరిపోదు.. పోటీ పెగింది. సినిమా మార్కెట్ కూడా పరిధులు దాటింది. అందుకు అనుగుణంగా స్కూలు మార్చాల్సిందే. ఏడాదికి ఒక సినిమా చేస్తానంటే కుదరదు.. పోటీలో నిలబడటం కష్టం.. ఈ విషయాన్ని గమనించిన స్టార్ హీరోలు సైతం ఏడాదికి రెండు మూడు సినిమాలు చేయడానికి రెడీ అయిపోతున్నారు.
ఇప్పటికే చిరు నుంచి నాని వరకు ప్రతీ హీరో రెండు మూడు సినిమాలతో బిజీగా బిజీగా గడిపేస్తున్నారు. కొంత మందేమో నాలుగైదు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి బ్యాక్ టు బ్యాక్ బాక్సాఫీస్ యుద్ధానికి రెడీ అవుతున్నారు. స్టార్ డైరెక్టర్స్ కూడా మేము కూడా రెడీ అంటూ సై అంటున్నారు. తాజాగా దర్శకుడు కొరటాల శివ కూడా తన స్కూలు మార్చేశారు. రచయితగా కెరీర్ ప్రారంభించిన కొరటాల శివ .. ప్రభాస్ నటించిన `మిర్చి` సినిమాతో డైరెక్టర్ గా తన ప్రస్థాన్నాన్ని ప్రారంభించారు.
తొలి చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో స్టార్ హీరోలనే టార్గెట్ గా పెట్టుకుని ఏడాదికి.. రెండేళ్లకో సినిమా చేస్తూ వస్తున్నారు. మిర్చి తరువాత రెండేళ్లు `శ్రీమంతుడు` సినిమా చేశారు. ఆ తరువాత ఏడాదికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో `జనతా గ్యారేజ్` తెరకెక్కించారు.
ఈ సినిమా తరువాత మరో ఏడాది తరువాతే ఆయన తెరకెక్కించిన `భరత్ అనే నేను` ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇక దాదాపు నాలుగేళ్ల విరామం తరువాత ఆయన నుంచి ఇప్పడు `ఆచార్య` సినిమా రాబోతోంది. ఇలా ఏడాది, రెండేళ్లు.. నాలుగేళ్లు సినిమా సినిమాకు గ్యాప తీసుకుంటున్న కొరటాల శివ ఇప్పడు తన స్కూలు మార్చేశారు.
ఈ సినిమా తరువాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాలని ఫిక్సయ్యారు. `ఆచార్య` తరువాత యంగ్ టైగర్ ఎన్టీఅర్ 30వ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ మూవీ జూన్ నుంచి సెట్స్ పైకి రాబోతోంది. దీని తరువాత మరో మూడు చిత్రాలు చేయబోతున్నానని ఇటీవల `ఆచార్య` ప్రమోషన్ లలో భాగంగా వెల్లడించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఓ సినిమా చేయబోతున్నారట. దీనికి సంబంధించిన బేసిక్ లైన్ ఓకే అయిందని చెప్పారు. అంతే కాకుండా రామ్ చరణ్ తోనూ ఓ మూవీ చేయబోతున్నారట.
ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, దీనికి సంబంధించిన ప్రకటన సరైన సమయంలో వుంటుందన్నారు. అంతే కాకుండా అల్లు అర్జున్ తోనూ గతంలో ఓ ప్రాజెక్ట్ ప్రకటించారు. అది డేట్స్ ని బట్టి ఎప్పుడు వుంటుందో చెబుతానన్నారు. ఇలా నాలుగేళ్ల విరామం తరువాత దర్శకుడు కొరటాల శివ తన స్కూల్ మార్చేసి బ్యాక్ టు బ్యాక్ మూడు ప్రాజెక్ట్ లు చేయబోతుండటం విశేషం.
కొరటాల శివ ప్రస్తుతం తెరకెక్కించిన `ఆచార్య` ఏప్రిల్ 29న విడుదల కాబోతోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటించారు. సినిమాకు చరణ్ క్యారెక్టర్ అత్యంత కీలకంగా నిలవనుంది.