Begin typing your search above and press return to search.

పెళ్లాం పోరు భ‌రించ‌లేక‌పోయిన స్టార్ హీరో

By:  Tupaki Desk   |   23 Nov 2022 2:30 AM GMT
పెళ్లాం పోరు భ‌రించ‌లేక‌పోయిన స్టార్ హీరో
X
ఒక అంద‌మైన హీరోయిన్ ని పెళ్లాడి ఎంతో మంది క‌వ్వించే హాట్ హీరోయిన్లతో రొమాన్స్ చేయ‌డం అంటే .. ఆ ఇంట్లో అరుపులు కేక‌లు అల‌క‌లు ఎలా ఉంటాయో ఊహించ‌డం ఏమంత క‌ష్ట‌మేమీ కాదు! ఎన్టీఆర్ నుంచి అక్కినేని నాగార్జున‌ వ‌ర‌కూ... ఇంకా నేటిత‌రంలో ఎంద‌రో యువ‌హీరోల‌కు ఇలాంటి అనుభ‌వాలున్నాయ‌ని గుస‌గుస‌లు వినిపించాయి.

అయితే బాలీవుడ్ సూప‌ర్ స్టార్ గా ద‌శాబ్ధాలుగా ఏల్తున్న ఖిలాడీ అక్ష‌య్ కుమార్ కి కూడా కెరీర్ పీక్స్ లో ఇలాంటి పెళ్లాం పోరు ఎదుర‌వుతూనే ఉండేద‌ట‌. ఫ‌లానా హీరోయిన్ తో అయితే అస్సలు న‌టించ‌వ‌ద్దు! అంటూ అక్ష‌య్ భార్య ట్వింకిల్ హుకుం జారీ చేసేద‌ట. అస‌లే అక్కీ రొమాంటిక్ ఫెలో. క‌థానాయిక‌ల‌తో "తూ ఛీజు బ‌డీ హై మ‌స్త్ మ‌స్త్.." అంటూ రొమాన్స్ ని ఇర‌గ‌దీయ‌డంలో ముందుంటాడు. ఇక మాజీ విశ్వ‌సుంద‌రి ప్రియాంక చోప్రాతో అప్ప‌ట్లో అత‌డి రొమాన్స్ ఒక రేంజులో కిక్కిచ్చేది. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా తెర‌వెనుక కూడా చాలా జ‌రుగుతోంద‌న్న గుస‌గుసలు అప్ప‌ట్లో వేడెక్కించాయి. అదే క్ర‌మంలో అక్ష‌య్ కి ఇంటి పోరు ఎదురైంది.

ట్వింకిల్ ఖన్నా అభ్యంతరం కారణంగా అక్షయ్ కుమార్ ప్రియాంక చోప్రాతో కలిసి పనిచేయడం మానేశాడని మ‌రోసారి రుజువు చూపెడుతూ ప్ర‌ముఖ ఫిలింమేక‌ర్ సునీల్ దర్శన్ ఆస‌క్తిక‌ర విష‌యాన్ని వెల్లడించారు. బర్సాత్ కోసం ప్రియాంక చోప్రాతో కలిసి అక్షయ్ కుమార్ ఒక సెన్సాఫ్ పాటను చిత్రీకరించామ‌ని అయితే ట్వింకిల్ ఖన్నా ఆ ఇద్ద‌రూ కలిసి పనిచేయడంపై అభ్యంతరాలు వ్యక్తం చేసినందున అతను సినిమా నుండి తప్పుకున్నాడని చిత్రనిర్మాత సునీల్ దర్శన్ వెల్లడించారు.

అక్షయ్ కుమార్ - ప్రియాంక చోప్రా జోడీ అప్ప‌టికే హిట్ పెయిర్ గా వెలిగిపోతోంది. అందాజ్- ముజ్సే షాదీ కరోగి - ఐత్రాజ్ వంటి అనేక చిత్రాలలో కలిసి పనిచేశారు. పెద్ద తెరపై ఈ జంట న‌డుమ ఘాటైన కెమిస్ట్రీ యువ‌త‌రాన్ని ఒక ఊపు ఊపేసేది. ప్రేక్షకులు అభిమానులు ఈ జోడీని రిపీటెడ్ గా తెర‌పై చూసేందుకు ఇష్టపడ్డారు. కానీ 2005 తర్వాత అక్షయ్ ప్రియాంకతో కలిసి పనిచేయడంఅక‌స్మాత్తుగా మానేసింది. దానికి కారణం మరెవరో కాదు ఖిలాడీ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా అని చిత్రనిర్మాత సునీల్ దర్శన్ వెల్లడించారు.

2005 చిత్రం 'బర్సాత్‌'లో ప్రియాంక చోప్రా - బిపాసా బసు సరసన అక్షయ్ ప్రధాన పాత్ర పోషించడానికి మొదట ఎంపికయ్యాడు. అతను ప్రియాంకతో రొమాంటిక్ సెన్సాఫ్ సాంగ్ చిత్రీకర‌ణ‌లోనూ పాల్గొన్నాడు. కానీ వెంటనే అతను సినిమా నుండి వైదొలిగాడు. ఆ తర్వాత సినిమాలో అక్షయ్ స్థానంలో బాబీ డియోల్ ని తీసుకున్నారు. ప్రియాంకతో హ‌బ్బీ రొమాన్స్ పండ‌డం న‌చ్చ‌క‌.. ట్వింకిల్ అభ్యంత‌రం చెప్ప‌డంతో అక్షయ్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు చిత్ర నిర్మాత తెలిపారు.

అక్షయ్ - ప్రియాంక ఒకే విధమైన వ్యక్తిత్వం స్వేచ్ఛాయుత ఆలోచ‌న‌ల‌తో చాలా మంచి జోడీగా కొన‌సాగేవార‌ని సునీల్ చెప్పాడు. వారు అద్భుతమైన కెమిస్ట్రీని తెర‌పై పండించారు. ఆ పాట కూడా ఎటువంటి అసభ్యత లేకుండా అశ్లీలత లేకుండా చాలా అందంగా తెర‌కెక్కించాం. కానీ చాలా సెన్సాఫ్ గా ఉంది. అయితే గ్లోబ‌ల్ బ్యూటీ ప్రియాంక ప్రపంచ పర్యటనకు వెళ్లి తిరిగి వచ్చే సరికి పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. అక్షయ్ - ప్రియాంక కలిసి పనిచేయడంపై ట్వింకిల్ అభ్యంతరం వ్యక్తం చేసిందని చిత్రనిర్మాతకి తర్వాత తెలిసిందట‌.

అప్పటికి అక్ష‌య్ కి అతని భార్యకు మధ్య వచ్చిన ఇతర సమస్యల గురించి కూడా నేను తెలుసుకున్నానని స‌ద‌రు నిర్మాత వెల్ల‌డించారు. ఆమెకు ప్రియాంకతో పెనుసమస్యలు ఉన్నాయని కూడా నాకు ఎవ‌రో చెప్పారు. వృత్తి ప‌రంగాను దీనివ‌ల్ల ప్రమాదాలు ఉన్నాయని నేను భావించాను. కొన్నిసార్లు సామీప్యత... కొన్నిసార్లు ఒక వ్యక్తి త‌మ‌దైన‌ జీవనశైలిన క‌లిగి ఉన్న‌ప్పుడు ఇలాంటి విషయాలన్నీ బ‌య‌ట‌కు వస్తాయి. దాని వల్ల బాధితులు ఎంత నష్టాన్ని చవిచూడాల్సి ఉంటుందో అర్థం చేసుకోకుండానే మీడియా దానిని బయటకు ప్ర‌చారం చేస్తుంది" అని సునీల్ వ్యాఖ్యానించారు. ఒక ర‌కంగా ట్వింకిల్ లో సందేహాలు రేకెత్తించేలా క‌థ‌నాలు వేయడం ద్వారా ప్రియాంక నుంచి అక్ష‌య్ దూరం అయ్యాడ‌ని.. ఈ రాద్ధాంతానికి మీడియా ర‌చ్చ ప్ర‌ధాన‌ కార‌ణమ‌ని ఆయన వివ‌ర‌ణ ఇచ్చారు.

ఆ తర్వాత అక్షయ్- ప్రియాంక కలిసి ఏ సినిమాలోను జంట‌గా కనిపించలేదు. ఎవ‌రికి వారు విజయవంతమైన తార‌లుగా కొనసాగారు. విడివిడిగా అపారమైన కీర్తిని పొందారు. అక్షయ్ ట్వింకిల్ ను వివాహం చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు ఆరవ్ - నితారా ఈ జంట‌కు జ‌న్మించారు. వారు పెరిగి పెద్ద వార‌వుతున్నారు. ప్రియాంక ఇటీవ‌లే నిక్ జోనాస్ ను వివాహం చేసుకున్నారు. సరోగ‌సీ విధానంలో కుమార్తె మాల్తీ మేరీని ఈ జంట‌ స్వాగతించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.