Begin typing your search above and press return to search.
బైక్ పై పది వేల కిలోమీర్లు వెళ్లిపోయిన స్టార్ హీరో.. నోరెళ్లబెడుతున్న ఫ్యాన్స్!
By: Tupaki Desk | 2 Feb 2021 9:21 AM GMTతమిళ్ ఇండస్ట్రీలో అజిత్ కు క్రేజ్ ప్రత్యేకం. హెయిర్ స్టైల్ మొదలు.. బాడీ లాంగ్వేజ్, కమర్షియల్ హిట్లు అజిత్ ను కోలీవుడ్లో ప్రత్యేకంగా నిలబెట్టాయి. రజినీకాంత్, విజయ్ తరువాత అత్యధిక అభిమానులున్న హీరోల్లో అజిత్ ఒకరు. ఎలాంటి అండ లేకుండా స్టార్ గా ఎదిగాడు అజిత్. కమర్షియల్ సినిమాలతో తన మార్కెట్ ను అంతకంతకూ పెంచుకున్నాడు.
తమిళ్ లో పవర్ ప్యాక్డ్ మాస్ ఫాలోయింగ్ ను సెట్ చేసుకున్న అజిత్ సినిమాలు.. బాక్సాఫీస్ వద్ద పంబ రేగ్గొడుతుంటాయి. ఆయన సినిమాలు వంద కోట్లకు తక్కువ కాకుండా కలెక్షన్లు రాబడుతుంటాయి. అజిత్ గత ఐదు సినిమాలు కూడా వరుసగా వంద కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించి సత్తా చాటాయి. అనవసర వివాదాలకు దూరంగా ఉండే అజిత్.. అభిమానులకు కూడా కాస్త దూరంగానే ఉంటాడు. కాగా.. బైక్ రైడింగ్ ను అమితంగా ఇష్టపడే అజిత్.. ఇటీవల బైక్ నడుపుకుంటూ వేల కిలోమీటర్లు వెళ్లిపోయాడు!
బైక్ రైడింగ్ ఎంత ఇష్టమంటే.. ఉంటే షూటింగ్‌లో, లేదంటే ఫ్యామిలీతో.. ఇవి రెండూ కాదంటే ఇక బైక్ పైనే కూర్చుంటాడీ హీరో. కొన్నిసార్లు షూటింగ్ స్పాట్ కు కూడా బైక్ పైనే వచ్చేస్తుంటాడు. లొకేషన్స్ వందల కిలో మీటర్ల దూరంలో ఉన్నా కూడా లెక్క చేయడు. ఒకసారి షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన అజిత్.. బైక్ పైనే చెన్నైకు వెళ్లిపోయాడట!
డ్రైవింగ్ ను అంతగా ఇష్టపడే అజిత్.. ఇక చాలా రోజుల తరవాత లాంగ్ డ్రైవ్ కు వెళ్లిపోయాడు. బైక్ రేసులో పాల్గొన్న ఎక్స్ పీరియన్స్ కూడా ఉండడంతో.. అజిత్ సేఫ్ జర్నీ చేస్తుంటాడు. రీసెంట్ గా తన బీఎండబ్ల్యూ బైక్ పై పదివేల కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేశాడీ హీరో. తన బైక్ పాట్నర్ ఒకరు సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని షేర్ చేసుకున్నారు.
చెన్నై నుంచి మొదలైన అజిత్ ప్రయాణం.. కోయంబత్తూర్ హైదరాబాద్ మీదుగా.. వారణాసి, గాంగ్ టక్, లక్నో, అయోధ్య వంటి ప్రాంతాలను చుట్టేశాడు. ఈ ప్రయాణంలో పది వేల కిలో మీటర్లకు పైగానే క్రాస్ చేశాడట. ఇప్పటివరకు ఏ స్టార్ హీరో కూడా ఇలాంటి రికార్డును క్రియేట్ చేయకపోవడం విశేషం. అజిత్ తో పాటు మరో ఇద్దరు ముగ్గురు కూడా ఆయనతో కలిసి వెళ్లినట్లు సమాచారం. ఇప్పుడీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.