Begin typing your search above and press return to search.

బోల్డ్‌ బ్యూటీ నుండి ఆ విషయాన్ని నేర్చుకుంటానంటున్న స్టార్‌ హీరోయిన్‌

By:  Tupaki Desk   |   21 March 2022 11:30 PM GMT
బోల్డ్‌ బ్యూటీ నుండి ఆ విషయాన్ని నేర్చుకుంటానంటున్న స్టార్‌ హీరోయిన్‌
X
బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ కంగనా రనౌత్‌ ప్రస్తుతం లాకప్ అనే ఒక టాక్ షో కమ్‌ గేమ్‌ షో ను నిర్వహిస్తుంది. ఉత్తరాదిన ఈ షో కు మంచి ఆదరణ లభించింది. సాదారణంగానే ఫైర్ బ్రాండ్‌ అంటూ పేరు ఉన్న ఈ అమ్మడు ఇప్పుడు ఈ షో తో మరింతగా తనలోని ఫైర్ ను బయటకు తీస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా ఈ అమ్మడు బోల్డ్‌ బ్యూటీ పూనమ్‌ పాండే తో ఎపిసోడ్‌ ను చేసింది.

ఆ ఎపిసోడ్‌ లో ఎప్పటిలాగే కంగనా తనదైన శైలిలో కంటెస్టెంట్‌ లతో ఆట ఆడుకుంది. ఒక్కొక్కరికి ఒక్కో తరహా టాస్క్ లు ఇస్తూ వారు ఆ టాస్క్ లు చేస్తున్న సమయంలో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. పూనమ్‌ పాండే తో సెడ్యూసింగ్ చేయించింది. శృంగార సమయంలో ఆడవారి ప్రవర్తన ఏంటి.. మగవారిని కవ్వించే తీరు ను సెడ్యూసింగ్‌ అంటారట. ఆ టాస్క్ లో పూనమ్ పాండే విరగ దీసిందని ప్రేక్షకులు మరియు కంగనా అంటోంది.

కంగనా ఒక అడుగు ముందుకు వచ్చి సెడ్యూసింగ్‌ అనేది 64 కళల్లో ఒక కళ. అవతలి వారిని సమ్మోహన పర్చే సత్తా కొద్ది మందికే ఉంటుంది. అది మీలో చాలా ఉందని కంగనా ప్రశంసలు కురిపించింది. మీరు ఈ సమ్మోహన పర్చే క్లాస్ లను చెప్పేందుకు ఒక ఇన్సిట్యూట్ ను ఏర్పాటు చేయవచ్చు. తద్వారా మీ నుండి చాలా మంది ఈ కళ ను నేర్చుకుంటారు అంటూ సరదాగా వ్యాఖ్యలు చేసింది.

మాలాంటి వారికి ఈ కళలో కోచింగ్ ఇవ్వండి. మహిళ ను అయిన నాకే మీరు సడ్యూసింగ్‌ చేస్తుంటే హాట్ గా అనిపించింది. అందుకే సమ్మోహనపర్చేందుకు పాఠాలు నేర్పే పాఠశాలను ఓపెన్‌ చేయండి. తద్వారా ఎంతో మంది ఈ కళ లో ప్రావిణ్యం పొందుతారు అంటూ కంగనా రనౌత్‌ షో లో చేసిన వ్యాఖ్య లు వైరల్‌ అవుతున్నాయి.

బాలీవుడ్ నుండి మరియు సౌత్‌ టీవీ షో ల నుండి ఎంతో మంది సెలబ్రెటీలు ఈ షో లో హాజరు అవుతున్నారు. ఇప్పటికే ఈ షో కు మంచి ఆధరణ లభిస్తుంది. కనుక ఖచ్చితంగా ముందు ముందు మరిన్ని సీజన్ లను కంగనా చేస్తుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.

ఈ షో కు ఏక్తా కపూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కంగనా ఇలాంటి షో లు చేయడం మొదటి సారి. అయినా కూడా తనదైన శైలితో లాకప్‌ ను సూపర్ హిట్‌ చేసింది. మరో వైపు కంగనా వరుసగా సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా తన సొంత బ్యానర్‌ లో బయటి వారితో సినిమాలను కూడా నిర్మిస్తుంది.