Begin typing your search above and press return to search.

అ! స్పెషల్ ఎఫెక్ట్స్ అవార్డు వెనుక కథ

By:  Tupaki Desk   |   18 Aug 2019 6:27 AM GMT
అ! స్పెషల్ ఎఫెక్ట్స్ అవార్డు వెనుక కథ
X
ఇటీవలే ప్రకటించిన జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమాకు చక్కని గుర్తింపు లభించిన సంగతి తెలిసిందే. అందులోనూ విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు మేకప్ విభాగంలోనూ పురస్కారం అందుకున్న అ! మరోసారి వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా ఎక్కువ హడావిడి లేకుండా కథకు అవసరమైనంత మేరకే గ్రాఫిక్స్ వాడి శెభాష్ అనిపించుకున్న సృష్టి విఎఫ్ఎక్స్ కు ఇప్పుడు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆ సంస్థ క్రియేటివ్ హెడ్ ఈశ్వర్ జబ్బా దీనికి సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

విజయవాడ సిటీ కేబుల్ లో గ్రాఫిక్స్ డిజైనర్ గా కెరీర్ ని మొదలుపెట్టిన తనకు ఇలాంటి మధుర క్షణం రావడం పట్ల ఈశ్వర్ ఎగ్జైట్ అవుతున్నారు. కార్తికేయ సినిమాకు చేస్తున్నప్పుడు కెమెరామెన్ కార్తిక్ ఘట్టమనేనితో ఉన్న పరిచయం ఈ అ! అవకాశం వచ్చేలా చేసిందని దర్శకుడు ప్రశాంత్ వర్మ తన ఆలోచనను అద్బుతంగా ఆవిష్కరించడం వల్లే ఇప్పుడీ విజయం సొంతమయ్యిందని చెప్పారు. కథలో అనవసరంగా గ్రాఫిక్స్ ని జోప్పించినప్పుడు కొన్నిసార్లు అవి కూడా పరాజయానికి కారణంగా నిలుస్తాయని కాబట్టి స్క్రిప్ట్ ని బట్టి ఎంతవరకు అవసరమో అంతవరకే ఎఫెక్ట్స్ వాడాలని పేర్కొన్నారు.

అ! విషయంలో దర్శకుడు ప్రశాంత్ వర్మకు క్లియర్ విజన్ ఉండటంతో పాటు నిర్మాత నాని తనకు పూర్తి స్వేచ్చ ఇచ్చారని అందుకే టైటిల్ కార్డు తో మొదలుకుని మురళి శర్మ ఆపై ప్రియదర్శి ఎపిసోడ్స్ న్యాచురల్ గా అనిపించేలా చేయడంతో టీం సక్సెస్ అయ్యిందని సంతోషం వ్యక్తం చేశారు. గోపాల గోపాలకు తక్కువ టైంలోనే మంచి అవుట్ పుట్ ఇచ్చామని చెప్పిన ఈశ్వర్ ఆ తర్వాత బాహుబలి రెండు భాగాల్లోనూ పాలుపంచుకున్న సృష్టి ఇప్పుడు అ! విషయంలో గర్వంగా తృప్తిగా ఉందని చెప్పడం విశేషం

పరిమితమైన సినిమాలు చేస్తామని, సినిమాల సంఖ్య కన్నా చేసే పని క్వాలిటీకే ప్రాధాన్యతమిస్తామన్నారు. క్రియేటివిటీకి ఎక్కువగా అవకాశముండే ఉండే ప్రకటనలు (advertisements) ఎక్కువ చేస్తుంటామని, ప్రత్యేకించి వర్చ్యువల్ రియాలిటీకి సంబంధించిన టెక్నాలజీస్ లో తమ సంస్థ అపార అనుభవం సాధించిందని చెప్పారు. వర్చ్యువల్ రియాలిటీని వినోదంతో కలిపే ప్రాజెక్ట్స్ కి ఎక్కువ ప్రాధాన్యతమిస్తామన్నారు. చిన్నదైనా, పెద్దదైనా, తమ దగ్గరకు వచ్చిన ప్రతి ప్రాజెక్ట్ ని అత్యంత శ్రద్ధతో చేస్తామని చెప్పారు.