Begin typing your search above and press return to search.

శ్రియా కూతురు 'రాధా' పేరు వెనుక కథ

By:  Tupaki Desk   |   19 Oct 2021 3:40 AM GMT
శ్రియా కూతురు రాధా పేరు వెనుక కథ
X
టాలీవుడ్‌ తో పాటు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై సుదీర్ఘ కాలం పాటు స్టార్‌ హీరోయిన్ గా వెలుగు వెలిగిన శ్రియా శరన్‌ అందరికి షాక్ ఇస్తూ తాను తల్లిని అయ్యాను అంటూ ప్రకటించింది. అది కూడా ఏడాదిన్నర క్రితమే నేను ఒక పాపకు జన్మను ఇచ్చాను అంటూ ప్రకటించడం అందరికి ఆశ్చర్యంను కలిగించింది. ఇప్పటి వరకు ఏ సెలబ్రెటీ కూడా పాప పుట్టిన తర్వాత ఇన్నాళ్లకు బయట పడింది లేదు. ఈమద్య కాలంలో ప్రెగ్నెంట్‌ కాక ముందే మీడియాలో ప్రెగ్నెంట్‌ అంటూ వార్తలు వస్తున్నాయి. అలాంటిది శ్రియా ప్రెగ్నెంట్‌ అయిన విషయం బయటకు తెలియలేదు.. పైగా ఆమె డెలవరీ విషయం కూడా రివీల్ అవ్వలేదు. కరోనా కారణంగా ఆమె డెలవరీ విషయం గోప్యంగా ఉంచడం సాధ్యం అయ్యింది అనేది కొందరి వాదన. ఆ విషయం పక్కన పెడితే ఇటీవలే తన కూతురు కు రాధా అనే పేరును పెట్టినట్లుగా ఆమె ప్రకటించింది. ఎన్నో మోడ్రన్‌ పేర్లు.. మరెన్నో స్టైలిష్ పేర్లు ఉండగా పాత పేరు అయిన రాధా ను ఎందుకు ఆమె పెట్టింది అంటూ అంతా చెవులు కొరుక్కుంటున్నారు.

రాధా అనే హిందూ పేరును ఆమె భర్త అయిన ఆండ్రీ కోస్చీవ్ ఎలా ఒప్పుకున్నాడు అంటూ కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తన కూతురు పేరు వెనుక కథను వెళ్లడించింది. శ్రియ ఇటీవల ఆ విషయమై స్పందిస్తూ... నాకు కూతురు పుట్టింది అనే విషయం చెప్పిన వెంటనే అమ్మ రాధా రాణి వచ్చేసిందన్నమాట అంటూ ఆనందంగా అనేసింది. అప్పుడే మీ అమ్మగారు చాలా సంతోషంగా ఉన్నారు. ఆనందంలో రష్యన్ లో మాట్లాడారే అన్నాడు. అప్పుడే నాకు తెలిసింది ఏంటీ అంటే రష్యన్ భాష లో రాధా అంటే సంతోషం అని అర్థం. రష్యన్‌ భాష లోనే కాకుండా ఇతర పలు భాషల్లో కూడా రాధా పేరుకు మంచి ప్రాముఖ్యత ఉంది. అందుకే ఆ పేరును పెట్టినట్లుగా చెప్పుకొచ్చింది. రష్యన్ భాషలో సంతోషం అయిన రాధా కు శరన్ మరియు కోస్చీవ్ పదాలను కలిపాము. మొత్తంగా మా పాప పేరు రాధా శరన్‌ కోస్చీవ్‌ అంటూ శ్రియ చెప్పుకొచ్చింది.

హీరోయిన్‌ గా రెండు దశాబ్దాల సుదీర్ఘ చరిత్రను కలిగి ఉన్న శ్రియ మళ్లీ నటిగా బిజీ అయ్యేందుకు ఆసక్తిగా ఉంది. ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా లో ఈమె కీలకమైన చిన్న పాత్రలో నటిస్తోంది. ఆ సినిమా తర్వాత మళ్లీ తెలుగు లో ఈమె బిజీ అవ్వడం ఖాయం అంటూ అభిమానులు చెబుతున్నారు. తెలుగు లో మాత్రమే కాకుండా ఏ భాషలో ఆఫర్లు వచ్చినా కూడా సినిమాలు చేసేందుకు సిద్దం అన్నట్లుగా ఉంది. తల్లి అయిన సమయంలో శ్రియ కాస్త బరువు అయ్యింది. ప్రస్తుతం ఆ బరువును కరిగించేందుకు ప్రయత్నాలు చేస్తోందట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం శ్రియ కు ఇప్పటికే ఆఫర్లు కూడా వస్తున్నాయని.. వచ్చే ఏడాది నుండి ఆమె మళ్లీ నటించేందుకు కూడా సిద్దం అవుతుందని అంటున్నారు. ఆర్‌ ఆర్‌ ఆర్‌ ప్రమోషన్‌ కార్యక్రమాల్లో వారం నుండి పది రోజుల పాటు పాల్గొనేందుకు ఆమె సిద్దంగా ఉందని కూడా సమాచారం అందుతోంది. ఈమద్య కాలంలో పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత కూడా నటనలో బిజీ అవుతున్న హీరోయిన్స్ ను చూస్తున్నాం. శ్రియ కూడా ఖచ్చితంగా ముందు ముందు మరిన్ని సినిమాలు చేస్తుందని ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు.