Begin typing your search above and press return to search.
వర్మని టార్గెట్ చేస్తూ బండ్ల గణేష్ చెప్పిన పిచ్చోడి కథ...!
By: Tupaki Desk | 26 July 2020 2:00 PM GMTరామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ''పవర్ స్టార్'' సినిమా ఎన్నో వివాదాల మధ్య ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో విడుదల అయింది. అందరూ అనుకున్నట్లు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయకుండా అతని చుట్టూ చేరిన భజన బ్యాచ్ వల్ల పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఓడిపోయాడనే కోణంలో ఈ సినిమా రూపొందించారు వర్మ. వారిలో పవన్ కళ్యాణ్ తో రెండు సినిమాలు నిర్మించిన ఆయన వీరాభిమాని బండ్ల గణేష్ పాత్రని కూడా సినిమాలో ఇన్వాల్వ్ చేసారు. బండ్ల గణేష్ ను గుండ్ల రమేష్ పాత్రలో చూపించి కామెడీ పండించారు వర్మ. 'పవర్ స్టార్' లో గుండ్ల రమేష్ పరుగున వచ్చి ప్రవన్ కాళ్ళ పై పడటం.. బ్రతికి ఉండగానే బయోపిక్ రైట్స్ అడగడం.. మీరు ఎన్నికల్లో ఓడిపోవాలని దేవుడికి మొక్కుకున్నా బాబూ.. ఎందుకంటే మీరు గెలిస్తే నాతో సినిమా తీసేవాడు ఎవడూ ఉండడు అనే డైలాగ్స్ ఆ పాత్రతో చెప్పించారు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు స్పందించని బండ్ల గణేష్ ఓ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు.
బండ్ల గణేష్ మాట్లాడుతూ.. 'పవర్ స్టార్' సినిమా గురించి విన్నానని.. ఆ సినిమాలో నా పాత్రని అలా క్రియేట్ చేయడం బాధనిపించిందని.. వర్మకి నా గురించి ఏ డైరెక్టర్స్ చెప్పుంటారో కూడా తెలుసని అన్నారు. ''ఈ సినిమాపై ఎప్పుడో స్పందించాలని అనుకున్నా. అయితే అలాంటి టైమ్ లో నాకు ఒక విషయం గుర్తొచ్చింది. నా చిన్నతనంలో మా ఊర్లో ఒక వ్యక్తి బాగా చదువుకొని కొన్ని రోజులకి పిచ్చోడిలా మారిపోయాడు. పిచ్చోడని తెలియడంతో అతని జోలికి వెళ్లడం మానేశారు. నేను కూడా వర్మను అలాంటి ఫీలింగ్ తోనే వదిలేశాను. అందుకే స్పందించలేదు. ఓ పిచ్చోడి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నన్ను తక్కువగా చేసి చూపించడం వల్ల నాకు ఇష్టమైన రామ్ గోపాల్ వర్మకు 100 రూపాయలు వస్తే నేను ఎంతో హ్యాపీ. కనీసం ఆ వందతో కాఫీ అయినా తాగుతాడు. ఆ తృప్తి నాకు ఉంది. నిద్రపోయినట్లు నటించే వాడిని ఏమి అనలేము. పిచ్చోడిని పిచ్చోడిలా వదిలెయ్యాలి. అతను కొంతకాలం ఒకరినే టార్గెట్ చేస్తాడు... ఆ తర్వాత ఇంకొకరి మీద రాయి విసురుతాడు. అలా ఎదో ఒక రోజు పిచ్చి ముదిరి తల పగిలకొట్టుకొని చచ్చిపోతాడు'' అంటూ బండ్ల గణేష్ రామ్ గోపాల్ వర్మకి కౌంటర్ గా పిచ్చోడి కథ వినిపించారు.