Begin typing your search above and press return to search.

తార‌క్ - జ‌క్క‌న్న చెప్పిన జీడిప‌ప్పుల‌ క‌థ

By:  Tupaki Desk   |   18 March 2022 4:30 PM GMT
తార‌క్ - జ‌క్క‌న్న చెప్పిన జీడిప‌ప్పుల‌ క‌థ
X
దేశం మొత్తం ఈగ‌ర్ గా వెయిట్ చేస్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ 'ఆర్ ఆర్ ఆర్‌' మ‌రి కొన్ని రోజుల్లో థియేట‌ర్ల‌లో హ‌ల్ చ‌ల్ చేయ‌బోతోంది. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, స్టార్ హీరోలు రామ్ చ‌ర‌ణ్ , ఎన్టీఆర్ దాదాపు మూడున్న‌రేళ్ల శ్ర‌కు సాక్ష్యం ఈ మూవీ. ఎంతో శ్ర‌మించి ఎన్నో వ్య‌వ‌ప్ర‌యాస‌కోర్చి ఈ మూవీ కోసం ప‌ని చేశారు. ఓ మ‌హా అద్భుతాన్ని భార‌తీయ సినీ చ‌రిత్ర‌లో సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించాల‌ని చేసిన ప్ర‌య‌త్న‌మిది. 'బాహుబ‌లి'తో తెలుగు సినిమా స‌త్తాని యావ‌త్ ప్ర‌పంచానికి చాటి బాలీవుడ్ మ‌న వెంట‌ప‌డేలా చేసిన రాజ‌మౌళి మ‌రో సారి 'ఆర్ ఆర్ ఆర్‌'తో ఆ అద్భుతాన్ని మ‌రోసారి రిపీట్ చేయాల‌ని చేసిన ప్ర‌య‌త్నం.

ఈ సినిమా కోసం ద‌క్షిణాదితో పాటు ఉత్త‌రాది కూడా ఆస‌క్తిగా దురుచూస్తోంది. బాలీవుడ్ వ‌ర్గాలు మాత్రం కంటిమీద కునుకులేకుండా ఈ సినిమా సాధించ‌బోయే రికార్డులపై క‌న్నేశారు. ఈ మూవీ త‌రువాత ద‌క్షిణాది సినిమా బాలీవుడ్ ని మ‌రింత‌గా డామినేట్ చేయ‌డం ఖాయ‌మ‌ని భ‌యాందోళ‌న‌కు హిందీ ఫిల్మ్ మేక‌ర్స్ భ‌య‌ప‌డుతున్న వేళ ఎట్ట‌కేల‌కు ఈ మూవీ మార్చి 25న రిలీజ్ కాబోతోంది. ఈ నేప‌థ్యంలో రాజ‌మౌళి ఇద్ద‌రు హీరోల‌తో క‌లిసి వ‌రుస ప్ర‌మోష‌న్స్ తో హీటెక్కిస్తున్నారు.

తాజాగా 'ది ఫోర్స్ ఆఫ్ ఆర్ ఆర్ ఆర్ : ఆఫ్ ది రికార్డ్ ఇంట‌ర్వ్యూ అంటూ ఓ వీడియోని వ‌దిలారు. ఈ వీడియోలో ఆఫ్ ది రికార్డ్ అంటూనే అత్యంత కీల‌క‌మైన విష‌యాల్ని ద‌ర్శ‌కుడు, హీరోలు బ‌య‌ట‌పెట్టేశారు. ఈ వీడియోలోని చివ‌రి మూడు నిమిషాల్లో రాజ‌మౌళి, తార‌క్ చెప్పిన జీడిప‌ప్పు క‌థ నెట్టింట వైర‌ల్ గా మారి అబిమానుల్ని సినీ ల‌వ‌ర్స్ ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఇంట‌ర్వెల్ త‌రువాత వ‌చ్చే స‌న్నివేశాల గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ ఆ త‌రువాత వ‌చ్చే స‌న్నివేశంకి ప్రేక్ష‌కులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాల‌ని వుంది. ఆ సీన్ వ‌చ్చిన‌ప్పుడు ఎవ‌రూ క‌నీసం సీట్ లో నుంచి అటు ఇటు క‌ద‌ల‌డం, క‌నురెప్ప వాల్చ‌డం లాంటివి ఏమీ చేయరు. అలా చూస్తూ వుండిపోతారన్నారు.

ఇక చివ‌రి 15 నిమిషాల సీన్ గురించి రాజ‌మౌళి మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల్ని వెల్ల‌డించారు. ఆ సీన్ లో మొద‌టి 13 నిమిషాలు ఒకెత్త‌యితే.. చివ‌రి 2 నిమిషాలు ఒకెత్త‌ని. మీరు ఆ రెండు నిమిషాల్లో చేసినపెర్ఫార్మెన్స్ తో 13 నిమిషాల ఎపిసోడ్ ని మ‌ర్చిపోయేలా చేశార‌న్నారు. అంతే కాకుండా సినిమాలో ఇద్ద‌రి బెస్ట్ పెర్ఫార్మెన్స్ లు రెండు.. అయితే రెండ‌వది చెప్ప‌కూడ‌ద‌ని న‌వ్వేశారు రాజ‌మౌళి. అక్క‌డే అందుకున్న తార‌క్ జీడిప‌ప్పు క‌థ చెప్పారు. చ‌ర‌ణ్ నీకు జీడిప్పుల క‌థ గుర్తుందా? ..ఈయ‌న‌దీ కీర‌వాణిగారిదీ కోడ్ లాంగ్వేజ్ అంటే జీడిప్పు క‌థ మొద‌లు పెట్టారు ఎన్టీఆర్‌.

సినిమా ఓ మంచి జీడిప‌ప్పు ఉక్మా. ఉక్మా బాగా తింటుంటే బాగుంట‌ది. అప్పుడ‌ప్పుడు ఓ జీడిప్పు వ‌స్తే ఇంకా బాగుంటుంది. జీడిప్పులే రాజ‌మౌళి లెక్క ప్ర‌కారం స్క్రీన్ ప్లే హైలైట్స్‌ అన్న‌మాట‌. ఒక‌సారి స‌గం జీడిప‌ప్పు ముక్కులు మాత్ర‌మే వ‌స్తాయి. ఒకోసారి ఫుల్ జీడిప‌ప్పు వ‌స్తుంది.. ఒకేసారి స్పూన్ లో దాదాపు మూడు నాలుగు జీడిప‌ప్పులు వ‌చ్చేస్తాయి. ఆ జీడిప్పునే జ‌క్క‌న్న ఇప్ప‌డు చెప్ప‌నంటున్నాడు' అని రాజ‌మౌళి - కీర‌వాణీల జీడిప‌ప్పు క‌థ‌ని ఎన్టీఆర్ రివీల్ చేస‌శాడు. అయితే రాజ‌మౌళి దీనికి మ‌రో వెర్ష‌న్ వినిపించాడు. సినిమా అయిపోయాక కీర‌వాణి అన్న‌య్య‌, నేను కూర్చుని చ‌ర్చించుకుంటుంటాం.

ఆయ‌న సినిమాలో ఎన్ని జీడిప్పులు వున్నాయిరా? అని అడుగుతారు. ఎక్క‌డెక్క‌డ జీడిప్పులు వున్నాయో లెక్కేసుకుంటాం. ఇక సెకండ్ హాఫ్ లో వున్న అస‌లైన సీన్ గురించి మాట్లాడితే అది జీడిప‌ప్పు కాదురా? ఆటం బాంబు అన్నాడ‌న్న‌య్య అన‌గానే రాజ‌మౌళి, ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్ భ‌ల్లున న‌వ్వేశారు. ఇంత‌కీ రాజ‌మౌళి - కీర‌వాణి లెక్క‌లో ఇంట‌ర్వెల్ త‌రువాత వ‌చ్చేది ఆటం బాంబ్ అట‌. అదే 'ఆర్ ఆర్ ఆర్‌'లో కీల‌కమ‌ని రాజ‌మౌళి చివ‌ర్లో చెప్ప‌డం విశేషం.