Begin typing your search above and press return to search.
బాలీవుడ్ లవ్ స్టోరీల సక్సెస్ ఎక్కువే
By: Tupaki Desk | 20 April 2022 12:30 AM GMTబాలీవుడ్ వెండితెర ప్రేమకథలంటే ప్రేక్షకులు అమితాసక్తిని చూపిస్తుంటారు. అదే తరహాలో రియల్ లైఫ్ ప్రేమలపై కూడా ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది. వెండితెరపై ప్రేమకథలతో అలరించే స్టార్ లు నిజంగా ప్రేమలో పడితే బాగుంటుంది కదా అని అలోచించని అభిమానులు వుండరు. మరి అలాంటి జంటలే ప్రేక్షకుల ఆలోచనలకు అనుగునంగా ప్రేమలో పడితే.. ఇక వారి వార్తల కోసం ప్రేక్షకులు ఓ రేంజ్ లో ఎగబడుతుంటారు.. ప్రేమ, పెళ్లి విషయాలని తెలుసుకోవాలని ఆరాటపడుతుంటారు. ఏ చిన్న అప్ డేట్ వచ్చినా ఆసక్తిగా చూస్తుంటారు.
గత కొన్నేళ్లుగా వార్తల్లో నిలుస్తూ వచ్చిన బాలీవుడ్ ప్రేమ జంటలు పెళ్లిదాకా వెళ్లినవి చాలానే వున్నాయి. ఇక్కడ ప్రేమకథల సక్సెస్ రేటు ఎక్కువే. వెండితెరపై ఒకప్పుడు బాలీవుడ్ ప్రేమకథలు బ్లాక్ బస్టర్ హిట్ లుగా నిలిచినట్టే రియల్ లైఫ్ లవ్ స్టోరీస్ సక్సెస్ రేటు కూడా అత్యధికంగానే వుంది. ఈ మధ్య బాలీవుడ్ తారలు ఏళ్ల తరబడి ప్రేమలో వుండటం ఆ తరువాత డెస్టినేషన్ వెడ్డింగ్ పేరుతో ఒక్కటవ్వడం చూస్తున్నాం. ఇందులో అత్యధిక శాతం జంటలు ఇప్పటికే అదే జోరుని కొనసాగిస్తూ సక్సెస్ ఫుల్ గా తమ లవ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.
సునీలల్ దత్ - నర్గీస్ నుంచి రణ్ బీర్ కపూర్ - అలియాభట్ వరకు బాలీవుడ్ ప్రేమకథలు సూపర్ సక్సెస్ కావడమే కాకుండా వార్తల్లో ప్రత్యేకంగా నిలిచాయి. నేటి తరం ప్రేమకథల్ని తీసుకుంటే రణ్ వీర్ సింగ్, దీపికా పదుకోన్, విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ, విక్కీ కౌశల్ - కత్రినా కైఫ్ తాజాగా రణ్ బీర్ కపూర్ - అలియాభట్ వరకు చాలా ప్రేమ కథలు పెళ్లి పీటలెక్కాయి. సక్సెస్ లవ్ స్టోరీలుగా నిరూపించుకున్నాయి. సంజయ్ దత్ మదర్ నర్గీస్ పంజాబీ ముస్లీం ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. సునీల్ దత్ బ్రాహ్మిన్ . వీరిద్దరి మధ్య చిగురించిన ప్రేమ పెళ్లికి దారితీసింది. ఇప్పటికీ వీరి ప్రేమకథని బాలీవుడ్ లో చెప్పుకుంటారు.
ఆ తరువాత మోడ్రన్ జంటల ప్రేమకథలు బాలీవుడ్ లో హాట్ టాపిక్ లుగా మారాయి. మరీ ముఖ్యంగా రణ్ వీర్ సింగ్ - దీపిక, విరాట్ కోహ్లీ - అనుష్క, రణ్ బీర్ కపూర్ - అలియా భట్, విక్కీ కౌశల్ - కత్రినా జంటలు ప్రముఖంగా వార్తల్లో నిలిచారు. వీరితో పాటు చాలా మంది స్టార్స్ ప్రేమకథల్ని సాగించినా సక్సెస్ కాలేకపోయారు. సల్మాన్ ఖాన్ ముందు ఐశ్వర్యారాయ్ తో ఆ తరువాత కత్రినా కైఫ్ తో ప్రేమలో పడ్డారు కానీపెళ్లి పీటల దాకా తీసుకురాలేకపోయారు.
కొంత మంది ప్రేమ, పెళ్లి దాకా వచ్చినా దాన్ని ఎక్కువ కాలం నిలుపుకోలేకపోయిన వారు కూడా వున్నారు. అలా ముందు వరుసలో నిలిచిన వ్యక్తులు అర్భాజ్ ఖాన్ - మలైకా అరోరా, హృతిక్ రోషన్ - సుసన్నేఖాన్ , అమీర్ ఖాన్ - కిరణ్ రావు ... ఈ రెండు జంటలు భిన్న మతలకు చెందిన వారు.
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ మధ్య లోనే వీరి వైవాహిక జీవితానికి శుభం కార్డు వేసేసి విడిపోయారు. దీంతో విడాకుల కారణంగానూ వీరు మళ్లీ వార్తల్లో నిలిచారు. అయితే విడిపోయిన జంటల కంటే బాలీవుడ్ లో ప్రేమించి పెళ్లి చేసుకుని ఇప్పటికీ వైవాహిక జీవితాన్ని లీడ్ చేస్తున్న జంటలే ఎక్కువ.