Begin typing your search above and press return to search.
బాహుబలి రుచి చూసేసిన మీడియా
By: Tupaki Desk | 7 Nov 2016 1:30 AM GMTబాహుబలి ది కంక్లూజన్ కోసం దాదాపు ఫిలిం లవర్స్ అంతా వెయిటింగ్ చేసేస్తున్నారు. మొన్నామధ్య ప్రభాస్ పుట్టిన రోజున బాహుబలి2 లుక్ అంటే.. కొత్త సంగతులు చెప్పేస్తారని అందరూ వెయిట్ చేస్తే.. జస్ట్ ఓ లుక్ తో సరిపెట్టేశాడు రాజమౌళి. కానీ ఆ రోజున బాహుబలి వర్చువల్ రియాలిటీ ఎక్స్ పీరియన్స్ అనే టెక్నాలజీ ఆధారిత అప్డేట్ ని ఇస్తే.. అప్పుడు అదేంటో తెలియని చాలా మందికి అర్ధం కాలేదు కానీ.. ఇప్పుడా ఎక్స్ పీరియన్స్ ను కళ్లకు కట్టాడు జక్కన్న.
'ది స్వోర్డ్ ఆఫ్ బాహుబలి' పేరుతో ప్రత్యేకమైన వర్చువల్ రియాలిటీ ఆధారిత వీడియోను వచ్చే ఏడాది రిలీజ్ చేయబోతున్నారు. ఈ వీడియోను మీడియా వ్యక్తులను హైద్రాబాద్ లో నిన్న మార్నింగ్ చూపించారు. ఈ వీఆర్ టీజర్ ను చూసిన మీడియా జనాలకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. రిఫ్ట్ హార్డ్ వేర్.. వీఆర్ ఇంజిన్స్ తో రూపొందించిన ఈ వర్చువల్ రియాలిటీ టీజర్ ను.. అదరహో అనడం చాలా చిన్న మాట. అసలు విషయం ఏంటంటే.. వచ్చే ఏడాది కానీ.. ది స్వార్డ్ ఆఫ్ బాహుబలి వీఆర్ వీడియో బయటకు వచ్చే చాన్స్ లేదు.
ఇప్పటివరకూ వీఆర్ టెక్నాలజీతో ప్రపంచవ్యాప్తంగా రూపొందించిన వీడియోల్లో ది స్వార్డ్ ఆఫ్ బాహుబలి టాప్ లో నిలుస్తుందనే టాక్ ఉంది. వచ్చే ఏడాది ప్రారంభం నుంచి.. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఈ వీఆర్ టీజర్ ను ప్రదర్శించేందుకు బాహుబలి టీం రెడీ అవుతోంది.