Begin typing your search above and press return to search.
`ఫ్యామిలీమ్యాన్ 2`ని తక్షణం నిషేధించాలని తమిళ ప్రభుత్వం డిమాండ్!
By: Tupaki Desk | 25 May 2021 4:32 AM GMTరాజ్ అండ్ డీకే రూపొందించిన `ఫ్యామిలీ మ్యాన్ 2` ప్రకంపనాల గురించి తెలిసిందే. బ్లాక్ బస్టర్ సిరీస్ కి కొనసాగింపు సీజన్ ట్రైలర్ వచ్చినప్పటి నుంచి వివాదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. మొదటి సీజన్ అభిమానులు సీజన్ 2 కోసం ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్న తరుణంలో ఈ వివాదం తీవ్రంగా నిరాశకు గురి చేస్తోంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ది ఫ్యామిలీ మ్యాన్ అభిమానులు ఎగ్జయిటింగ్ గా వేచి చూస్తున్నారు. కానీ తాజా వివాదాల కారణంగా ఇది చెప్పిన టైమ్ కి స్ట్రీమింగ్ అవుతుందా? అన్నది సందిగ్ధంగా మారింది.
ఫ్యామిలీమ్యాన్ 2 ట్రైలర్ లో తమిళ టైగర్స్ ని తప్పుడు విధానంలో చూపించారని తమిళులకు అవమానం ఎదురవుతోందని రచ్చ కొనసాగుతోంది. వివాదాల అనంతరం ట్రైలర్ ను కొంచెం మార్చాలని ప్రయత్నించినా కానీ దాంతో ఏ ఉపయోగం లేదు.
తాజాగా ది ఫ్యామిలీ మ్యాన్ 2 ను ప్రీమియర్లను నిషేధించాలని కోరుతూ తమిళ ప్రభుత్వం సమాచార ప్రసార మంత్రికి రాసిన లేఖను రాసింది. సిరీస్ లో ఈలం తమిళులను అత్యంత అభ్యంతర విధానంలో చూపారు. శ్రీలంకలో ఈలం తమిళుల చారిత్రక పోరాటాన్ని వక్రీకరించారు. వారి దీర్ఘకాల ప్రజాస్వామ్య యుద్ధం త్యాగాలను తప్పుగా చూపించారని కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. ఇది తమిళ సంస్కృతి విలువను బలహీనపరిచింది. అద్భుతమైన తమిళ సంస్కృతికి వ్యతిరేకంగా ఈ సిరీస్ లో చాలా అవమానాలు.. అవరోధాలు ఉన్నాయని ఆరోపించింది.
వెబ్ సిరీస్ లో తమిళ నటి సమంతను ఉగ్రవాదిగా నటించడం ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న తమిళుల పై నేరుగా దాడి చేయడమేనని..ఇలాంటి ప్రచారాన్ని సహించరని ఈ లేఖలో పేర్కొన్నారు. ఈలం తమిళుల మనోభావాలను దెబ్బతీయవద్దని టిఎన్ ప్రభుత్వం కోరింది. ప్రసారం చేస్తే రాష్ట్రంలో సామరస్యాన్ని కాపాడుకోవడం ఇబ్బందికరం. అమెజాన్ ప్రైమ్ తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా `ది ఫ్యామిలీ మ్యాన్ 2` విడుదలను ఆపడానికి లేదా నిషేధించడానికి తక్షణం చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వం అభ్యర్థించింది.