Begin typing your search above and press return to search.

న్యూయార్క్ వీధుల్లో తార‌క్ దంపతుల విహారం!

By:  Tupaki Desk   |   27 Dec 2022 5:43 AM GMT
న్యూయార్క్ వీధుల్లో తార‌క్ దంపతుల విహారం!
X
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్-ప్ర‌ణ‌తీ ఇటీవ‌ల లండ‌న్ టూర్ వెళ్లిన సంగ‌తి తెలిసిందే. తార‌క్ 30 వ చిత్రం ప్రారంభానికి ముందే ఓసారి అలా లండ‌న్ అందాల్లో సేద తీరాల‌ని భావించిన ద్వ‌యం అనుకోకుండా ప్లైట్ ఎక్కి లండ‌న్ లో వాలిపోయారు. ప్రస్తుతం దంప‌తులిద్ద‌రు లండ‌న్ అందాల్ని ఆస్వాదిస్తున్నారు. తాజాగా లండ‌న్ విధుల్ని రాత్రి స‌మ‌యంలో చుట్టేస్తోన్న ఫోటో ఒక‌టి లీకైంది.

ఇందులో తార‌క్..ప్ర‌ణ‌తీ ఇద్ద‌రు షాపింగ్ చేసి ఇలా రోడ్ల‌పై నుంచుని ఫోజులిచ్చారు. ఇందులో ద్వ‌యం బ్లూ క‌ల‌ర్ జీన్స్ ప్యాట్ లో.. వింటర్ కోట్ లో క‌నిపిస్తున్నారు. ప్ర‌స్తుతం అక్క‌డ ఎముకులు కొరికే చ‌లి పులిలా మింగే స‌మ‌యం. అందుకే ఇలా బందోబ‌స్తుతో బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. స‌రిగ్గా ఇద్ద‌రు జీబ్రా క్రాసింగ్ వ‌ద్ద నుంచుని కెమెరాకి ఫోజులిచ్చారు.

చుట్టూ మాల్స్..ప్ర‌కాశ‌వంతమైన లైటింగ్ న‌డుమ దంప‌తుల ఫోటో క్రేజీగా ఉంది. అయితే ఈ ఫోటోలో ఎక్క‌డా పిల్ల‌లు ఇద్ద‌రు క‌నిపించ‌లేదు. పిల్ల‌ల్నిద్ద‌ర్నీ టూర్ కి తీసుకెళ్లారా? లేదా? అన్న‌ది క్లారిటీ లేదు. ప్ర‌స్తుతం ఈఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. అభిమానులు త‌మ‌దైన శైలిలో తార‌క్ జోడీని ఉద్దేశించి కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

తార‌క్-ప్ర‌ణ‌తీ వెకేష‌న్స కి వెళ్ల‌డం చాలా రేర్. ఎక్కువ‌గా హైద‌రాబాద్ లోనే ఉంటారు. ఏ వేడుకైనా కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో సెల‌బ్రేట్ చేసుకుంటారు. న్యూయ‌ర్ వేడుక‌లు మాత్రం ఈసారికి లండ‌న్ లో ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. అక్క‌డ సెల‌బ్రేష‌న్స్ పూర్త‌యిన అనంత‌రం తిరుగు ప్ర‌యాణం చేయ‌నున్నారు.

అటుపై తార‌క్ 30వ సినిమాని సంక్రాంతి త‌ర్వాత ప‌ట్టాలెక్కించనున్నారు. ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ అన్ని ర‌కాల ప‌నులు పూర్తి చేసుకుని రెడీగా ఉన్నారు. తార‌క్ తిరిగి రాగానే సంక్రాంతి సంబురాలు పూర్తికాగానే వాయు వేగంతో షూటింగ్ బ‌రిలోకి దిగిపోతారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.