Begin typing your search above and press return to search.
భారతదేశంలో `టెనెట్` ఎప్పుడు విడుదలవుతుంది?
By: Tupaki Desk | 7 Oct 2020 2:30 PM GMTమహమ్మారీ పంచ్ మామూలుగా లేదు. అంతర్జాతీయ స్థాయిలో సినిమా ప్రపంచంపై తీవ్ర ప్రభావం పడింది. వందల కోట్ల నష్టం భర్తీ చేయలేని సన్నివేశమే తెచ్చింది. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన చిత్రం `టెనెట్` ప్రపంచంలోని ఎంచుకున్న ప్రాంతాలలో థియేటర్లలో విడుదల చేసినా ఆశించిన స్థాయి వసూళ్లను సాధించలేకపోయింది. మూవీ బావుందని విమర్శకులు ప్రశంసలు కురిపించినా కానీ జనం థియేటర్లకు వచ్చేందుకు సుముఖంగా లేక ఇబ్బందుల పాలైంది.
ఇటీవల COVIID-19 ప్రభావం కొంత మందగించింది. దీంతో కొన్ని ప్రాంతాలలో సినిమాహాళ్ళు తెరవడం ప్రారంభించారు. టెనెట్ వాయిదాల ఫర్వంలో ఎట్టకేలకు రిలీజైంది. అయితే విదేశీ రిలీజ్ సంగతి అటుంచితే.. భారతదేశంలో టెనెట్ రిలీజ్ ఎపుడు? సంచలనాలకు ఆస్కారం ఉందా? అంటూ నోలాన్ అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఈ చిత్రం కోసం కొత్త విడుదల తేదీ ఇప్పటికే ఫిక్సయ్యిందని సమాచారం.
టెనెట్ చిత్రం సెప్టెంబర్ 18 న భారతదేశంలో విడుదల కానుంది. అనేక ఇతర దేశాలలో కూడా మారిన తేదీ ప్రకారం రిలీజవుతుందట. ఇండియా అభిమానులు తమకు దగ్గరలో ఉన్న థియేటర్ కు ఎప్పుడు వస్తారో తెలుసుకోవటానికి అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. ఈ చిత్రం ప్రారంభమైన మొదటి కొన్ని రోజుల తర్వాత అద్భుతమైన స్పందన పొందుతోంది. హాలీవుడ్ టాప్ హీరో టామ్ క్రూజ్ స్వయంగా ఈ చిత్రాన్ని చూడటానికి ఒక థియేటర్ సందర్శించిన సంగతి తెలిసిందే. తాను ప్రేమించిన చిత్రమిదని ప్రశంసించిన టామ్ క్రూజ్ పూర్తి రక్షణతో తన ఇంటి నుండి బయలుదేరి సినిమా చూడటం విశేషం.
ఏడెనిమిది నెలల గ్యాప్ తర్వాత లాక్ డౌన్ ముగిశాక.. విస్తృతంగా విడుదలైన మొదటి చిత్రంగా టెనెట్ రికార్డులు సృష్టించనుంది. భారీగా రిలీజ్ కుదిరిన తొలి దేశం మెక్సికో అవుతుంది. సెప్టెంబర్ 16 న మెక్సికోలోని థియేటర్లలో టెనెట్ ని ప్రదర్శిస్తారు. బ్రెజిల్,.. అర్జెంటీనా,.. చిలీ..., బొలీవియా,... కోస్టా రికా,.. ఎల్ సాల్వడార్,.. గ్వాటెమాల,.. హోండురాస్,.. నికరాగువా,.. పనామా .. పెరూ దేశాల్లో సెప్టెంబర్ 24 న థియేటర్లలో విడుదలవుతుంది. వెనిజులా అభిమానులు సెప్టెంబర్ 25 న ఈ చిత్రాన్ని చూడటానికి రెడీ అవుతున్నారు. కొలంబియా లో అక్టోబర్ 15 న విడుదలవుతుంది. ఇండోనేషియా.. పిలిప్పీన్స్ లోనూ ఈ మూవీ రిలీజ్ కానుంది.