Begin typing your search above and press return to search.

ఇండస్ట్రీని శాసించబోతున్న 'ఆ ముగ్గురు' స్టార్ హీరోలు

By:  Tupaki Desk   |   25 March 2020 2:30 AM GMT
ఇండస్ట్రీని శాసించబోతున్న ఆ ముగ్గురు స్టార్ హీరోలు
X
టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ హీరోలుగా కొనసాగుతున్నవారు ఇప్పుడు కొత్తగా ఆలోచిస్తున్నారు. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ఇతర వ్యాపారాలు కూడా చేస్తున్నారు. ఇది ఇండస్ట్రీలో ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది కాదు. అప్పట్లో అక్కినేని నాగార్జున స్టార్ట్ చేసిందే. నటుడిగా బిజీగా ఉన్నప్పుడే వివిధ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టిన నాగార్జున సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అనిపించుకున్నాడు. ఆ తర్వాత కొంతమంది నాగార్జున బాటలోనే నడుస్తూ వ్యాపార రంగంలోకి దిగారు. అయితే వాళ్లలో కొందరు సక్సెస్ అవ్వగా మరికొందరు చేతులు కాల్చుకున్నారు. ఇప్పుడు స్టార్ హీరోలు కూడా అదే రూట్ ఎన్నుకుంటున్నారు. వాళ్లలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్ ల గురించి. ఈ ముగ్గురు హీరోలు ప్రస్తుతం ఒక గ్రూప్ గా తయారయ్యారనేది ఇండస్ట్రీలో టాక్. స్వతహాగా ఎప్పుడూ కలిసి మెలిసి ఉండే ఈ ముగ్గురు బిసినెస్ విషయంలో కూడా ఒకేలా ఆలోచిస్తున్నారట. వీరి మేనేజర్ల ద్వారా ఫైనాన్సిల్ విషయాల్లో ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటారట.

అల్రెడీ మహేష్ బాబు సొంతగా ప్రొడక్షన్ హౌజ్ స్టార్ట్ చేసి సినిమాలు, వెబ్ సిరీస్ లు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ కూడా కొణిదల ప్రొడక్షన్ హౌజ్ స్టార్ట్ చేసి సినిమాలను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళ బాటలోనే ఎన్టీఆర్ కూడా నడవనున్నాడని సమాచారం. తన తండ్రి హరికృష్ణ పేరు మీద నిర్మాణ సంస్థ స్టార్ట్ చేయబోతున్నట్లు ఈ మధ్య వార్తలొచ్చాయి. ఇదిలావుండగా మొన్నటి దాకా ప్రొడక్షన్ హౌసెస్ మీద ఉన్న వీళ్ల దృష్టి ఇప్పుడు థియేటర్ల మేనేజ్మెంట్ మీద పడిందట. ఈ ముగ్గురిలో మహేష్ ఆల్రెడీ దీనికి నాంది పలికాడు. ఏ.ఎమ్.బి సినిమాస్ ఏర్పాటు చేసి థియేటర్ మేనేజ్మెంట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే బాటలో రామ్ చరణ్, ఎన్టీఆర్ నడుస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద ఈ ముగ్గురు సౌత్ ఇండియాలో మల్టీప్లెక్స్ చెయిన్ ఒకటి స్టార్ట్ చేసే ప్లాన్ లో ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. వీరి బిజినెస్ ప్లానింగ్ గురించి తెలుసుకున్న వారు షాక్ అవుతున్నారంట. ఏదేమైనా అన్నీ ఉన్నప్పుడే ఇల్లు చక్కపెట్టుకోవాలనే కాన్సెప్ట్ వీళ్ళకి బాగా అర్ధమైనట్లుంది. ఇలాంటి ఫ్యూచర్ ప్లాన్ తో ముందుకెళ్తున్న ఈ ముగ్గురు సక్సెస్ అవుతారో లేదో చూడాలి.