Begin typing your search above and press return to search.
చిరూ సినిమా దెబ్బకొట్టేయడంతో కసి పెరిగింది!
By: Tupaki Desk | 24 Jan 2022 9:30 AM GMTచిత్రపరిశ్రమలో ఒక సక్సెస్ ఫుల్ నిర్మాతగా నిలబడటం .. తన బ్యానర్ పై ప్రేక్షకులకు ఒక నమ్మకాన్ని కలిగించడం అంత తేలికైన విషయమేం కాదు.
అలాంటి నిర్మాతలలో ఒకరిగా కేఎస్ రామారావు కనిపిస్తే, అలాంటి బ్యానర్లలో ఒకటిగా క్రియేటివ్ కమర్షియల్స్ నిలుస్తుంది. పోస్టర్ పై బ్యానర్ పేరు చూసి, ఈ సినిమాకి వెళ్లొచ్చునుకునేలా చేసిన ప్రత్యేకత క్రియేటివ్ కమర్షియల్స్ సొంతం.
ఈ బ్యానర్ పై అభిలాష .. ఛాలెంజ్ .. స్వర్ణకమలం .. మాతృదేవోభవ వంటి ఎన్నో సూపర్ హిట్స్ వచ్చాయి. అలాంటి బ్యానర్లో 'స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్' వంటి ఫ్లాప్ పడింది.
ఆ విషయాన్ని గురించి తాజా ఇంటర్వ్యూలో కేఎస్ రామారావు మాట్లాడుతూ .. "నా బ్యానర్లో వరుస హిట్లు ఇస్తూ వస్తున్నాను. అలాంటి సమయంలో 'స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్' చేశాను. అప్పటివరకూ ఫ్లాప్ కి సంబంధించిన ఎఫెక్ట్ ఎలా ఉంటుందనేది నాకు పెద్దగా తెలియదు. అప్పటికే మెగాస్టార్ తో జర్నీ చేసిన నాకు 'స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్' పెద్ద కుదుపు. దానికి రీజన్ ఆ సినిమా బాగాతీయకపోవడమో .. బాగా చేయకపోవడమోనని నేను అనుకోవడం లేదు.
జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించడం జరిగింది.
'స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్' యండమూరి వీరేంద్రనాథ్ గారి నవల. కమర్షియల్ డైరెక్టర్ గా చెప్పుకోవడానికి ఆయన ఎక్స్ పీరియన్స్ సరిపోని టైమ్ అది. ఈ సినిమా ఫెయిలైన తరువాత నా మీద నాకే డౌట్ వచ్చింది. నా జడ్జిమెంట్ ఎలా తప్పింది? అనే ఆలోచనలో పడ్డాను.
ఎక్కడ పొరపాటు జరిగింది? నేను ఫ్లాప్ సినిమా తీయడం ఏంటి? అనే అహం నాలో కలిగింది. ఇండస్ట్రీలో నన్ను నేను నిరూపించుకోవడానికి ఏదో ఒకటి చేయాలి అనే ఒక విపరీతమైన కసి నాలో పెరిగిపోయింది. ఆ పట్టుదలతో తీసిన సినిమానే 'చంటి' అంటూ చెప్పుకొచ్చారు