Begin typing your search above and press return to search.
శోభన్ బాబు గారు అలాంటివారు కాదు
By: Tupaki Desk | 15 May 2018 6:15 AM GMTమహానటి విడుదల అయ్యాక ఇప్పటి జెనరేషన్ కు సైతం నిన్నటి తరం నటీనటుల కథలు తెలుసుకోవాలనే ఆసక్తి పెరుగుతోంది. సావిత్రి గారి జీవితంలో ఇన్ని ఎగుడుదిగుడులు ఉన్నాయా అని ఆవిడ కథ గురించి అంతగా అవగాహన లేని వాళ్ళు సినిమా చూసాక ఆశ్చర్యపోతున్నారు. ఈ నేపధ్యంలో ఇలాంటి బయోపిక్స్ ఇంకా ఎవరెవరి మీద వస్తే బాగుంటుందా అనే చర్చ కూడా మొదలయింది. అందులో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న పేరు దివంగత జయలలిత. తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎంతటి ఖ్యాతి సంపాదించారో అంతకన్నా ముందే సినిమా రంగంలో అశేషమైన పేరు ప్రఖ్యాతులు ఆవిడ సొంతం. తెలుగు సినిమాల్లో టాప్ హీరొయిన్ గా వెలుగుతున్న తరుణంలో ఆవిడకు అందాల నటుడు శోభన్ బాబు గారికి లవ్ ట్రాక్ నడిచేది అనే వార్తలు అప్పట్లోనే హల్చల్ చేసాయి. కాని వాటి గురించిన స్పష్టత మాత్రం ఎప్పుడు దొరకలేదు.
మహాకవి రచయిత ఆరుద్ర గారి సతీమణి రామలక్ష్మి గారు దీనికి సంబంధించిన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసారు. ఒక వెబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీని గురించి ఓపెన్ గానే చెప్పేసారు. శోభన్ బాబు జయలలిత మధ్య ఎటువంటి ఎఫైర్ లేదని శోభన్ బాబు గారి భార్య ఆయన అందానికి సరితూగేంత స్థాయిలో లేకపోవడంతో పాటు లావుగా ఉండేవారని అందుకే అప్పుడప్పుడు కామెంట్స్ వచ్చేవని అన్నారు. ఆ నేపధ్యంలోనే జయలలిత పట్ల ఆయన ఆకర్షితుడు అయ్యాడని కథలు అల్లారని చెప్పారు. శోభన్ బాబు ఏనాడూ తన భార్యను మోసం చేయాలని అనుకోలేదని కేవలం ఇదంతా అప్పటి మీడియా సృష్టి అని కొట్టిపారేసారు. ఒకవేళ శోభన్ బాబు నిజంగా తలుచుకుంటే ఎవరినైనా పడేసే ఆకర్షణ ఆయనలో ఉందని స్పష్టం చేసారు. వాళ్ళిద్దరి మధ్య మంచి స్నేహం తప్ప ఇంకేమి లేదని కుండ బద్దలు కొట్టేసారు.
సో ఫైనల్ గా జయలలిత గారి జీవితంలో శోభన్ బాబు గారి పేజీ స్నేహం అనే పేరు మీద ఉంటే అప్పటి మీడియా దాన్ని ప్రేమ అనే పేరుతో మార్చి రాసిందన్న మాట. ఒకవేళ కోలీవుడ్ లో షికారు చేస్తున్న పుకార్లు కనక నిజమయ్యి జయలలిత బయోపిక్ కనక కార్యరూపం దాలిస్తే ఈ ఎపిసోడ్ చూపించాల్సిందే. కాని ఆవిడ పాత్రను ధరించే ధైర్యం ఎవరికి ఉందా అనేది భేతాళ ప్రశ్న.