Begin typing your search above and press return to search.

లెజెండ‌రీ డైరెక్ట‌ర్ తో ఆ ఇద్ద‌రి ఫైట్‌!

By:  Tupaki Desk   |   15 Sep 2022 2:30 AM GMT
లెజెండ‌రీ డైరెక్ట‌ర్ తో ఆ ఇద్ద‌రి ఫైట్‌!
X
క‌ల్ట్ క్లాసిక్ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచిన త‌మిళ ద‌ర్శ‌కులు మ‌ణిర‌త్నం, గౌత‌మ్ మీన‌న్‌, సెల్వ‌రాఘ‌వన్‌. ఈ ముగ్గురు ద‌ర్శ‌కులు రూపొందించిన సినిమాలు త‌మిళంతో పాటు తెలుగులోనూ సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించి క‌ల్ట్ క్లాసిక్స్ గా నిలిచిపోయాయి. ప్ర‌స్తుతం ఈ ద‌ర్శకులు తెర‌కెక్కించిన మూడు సినిమాలు సెప్టెంబ‌ర్ లో ప‌దిహేను రోజుల గ్యాప్ తో తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక కాలంలో బాక్సాఫీస్ వ‌ద్ద ఫైట్ కి రెడీ అయిపోతున్నాయి.

విచిత్రం ఏంటంటే ఈ మూడు సినిమాలు ఈ ముగ్గురికి చాలా కీల‌కంగా మారాయి. ఆగ‌స్టులో టాలీవుడ్ వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్ ల‌ని అందించిన విష‌యం తెలిసిందే. అవ‌న్నీ స్ట్రెయిట్ సినిమాలు. అయితే సెప్టెంబ‌ర్ లో మాత్రం చాలా వ‌ర‌కు డ‌బ్బింగ్ సినిమాల మ‌ధ్య పోటీ జ‌ర‌గ‌బోతోంది. ఇందులో మ‌ణిర‌త్నం, గౌత‌మ్ మీన‌న్‌, సెల్వ‌రాఘ‌వన్ తెర‌కెక్కించి సినిమాలు వుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ ముగ్గురు ద‌ర్శ‌కుల్లో ముందుగా ల‌వ్ స్టోరీస్ స్పెష‌లిస్ట్ గౌత‌మ్ మీన‌న్ రూపొందించిన త‌మిళ సినిమా 'వెందుతానిందాతు కాడు' సెప్టెంబ‌ర్ 17న విడుద‌ల‌వుతోంది.

ఇదే మూవీని తెలుగులో 'ద లైఫ్ ఆఫ్ ముత్తు' పేరుతో స్ర‌వంతి మూవీస్ వారు రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ గౌత‌మ్ మీన‌న్ తో పాటు హీరో శింబు కెరీర్ కు కీల‌కంగా నిలిచింది. ఏ.ఆర్‌. రెహ‌మాన్ సంగీతం అందించిన ఈ మూవీ కోసం తెలుగులోనూ మంచి క్రేజ్ ఏర్ప‌డింది. ఇక ఇదే నెల సెప్టెంబ‌ర్ 29న ధ‌నుష్ న‌టించిన 'నానే వ‌రువేన్‌' రిలీజ్ అవుతోంది. సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. వీరిద్ద‌రి క‌లయిక‌లో వ‌స్తున్న నాలుగ‌వ సినిమా ఇది. ఇందెలో సెల్వ‌రాఘ‌వ‌న్ కూడా ఓ కీల‌క పాత్ర‌లో న‌టించాడు.

7జ‌2 బృందావ‌న కాల‌నీ, యుగానికి ఒక్క‌డు వంటి సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైన సెల్వ‌రాఘ‌వ‌న్ నుంచి చాలా కాలం త‌రువాత వ‌స్తున్న సినిమా కావ‌డంతో ఈ మూవీ కోసం కూడా ప్రేక్ష‌కులు ఆస‌క్తిగానే ఎదురుచూస్తున్నారు. యువ‌న్ శంక‌ర్ రాజా అందించిన సంగీతం, ఎల్లీ అవ్ర‌మ్ గ్లామ‌ర్ ఈ మూవీకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణగా నిల‌వ‌నున్నాయి. పైగా ధ‌నుష్ న‌టించిన 'తిరు' రీసెంట్ గా విడుద‌లై రూ. 100 కోట్ల క్ల‌బ్ లో చేరి రికార్డు సృష్టించింది.

దీనికితోడు ఈ మూవీని తెలుగులో గీతా ఆర్ట్స్ వారు రిలీజ్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో సినిమాకు మంచి బిజినెస్, థియేట‌ర్లు ల‌భించే అవ‌కాశం వుంది. ఇక ఈ రెండు సినిమాల త‌రువాతే లెజెండ‌రీ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం డ్రీమ్ ప్రాజెక్ట్ 'పొన్నియిన్ సెల్వ‌న్ 1' సెప్టెంబ‌ర్ 30న తమిళ‌, తెలుగు భాష‌ల‌తో పాటు మ‌రో మూడు భాష‌ల్లో విడుద‌ల కాబోతోంది. ఎంత భారీగా తెర‌కెక్కించినా ఈ మూవీకి త‌మిళంలో త‌ప్ప తెలుగులో బ‌జ్ వినిపించ‌డం లేదు.

దిల్ రాజు రిలీజ్ చేస్తున్నాడు కాబ‌ట్టి థియేట‌ర్లు భారీగానే ల‌భించే అవ‌కాశం వుంది. మూడు సినిమాల‌కు బిగ్ ప్రొడ్యూస‌ర్స్ తెలుగులో వెన్నుద‌న్నుగా నిల‌వ‌డంతో ఈ బాక్సాఫీస్ ఫైట్ లో పై చేయి సాధించేది ఎవ‌ర‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.