Begin typing your search above and press return to search.
సినీ ఇండస్ట్రీలో మాఫియాపై విలక్షణ నటుడు కీలక వ్యాఖ్యలు..!
By: Tupaki Desk | 11 Nov 2022 4:11 AM GMTవిలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసే నటుడాయన. గత కొన్నేళ్లుగా ఎన్నో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో కొన్ని వందల సినిమాల్లో నటించారు.
రియల్ లైఫ్ లోనూ ప్రకాశ్ రాజ్ విలక్షంగానే జీవిస్తుంటారు. ఏ విషయాన్నైనా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతుంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ఆయన ముందే ఉంటాడు. ప్రకాష్ రాజ్ ఫౌండేషన్ ద్వారా ఎందరి జీవితాల్లోనో వెలుగు నింపారు. అయితే తాను నటించిన "ముక్బీర్" అనే చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రకాశ్.. పలు ఆసక్తిరమైన విషయాలు పంచుకున్నారు.
"మీలోని నటుణ్ని పూర్తి స్థాయిలో ఆవిష్కరించే అవకాశం రాలేదని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా?" అని ప్రశ్నించగా.. 'నాలో నటుడు ఉన్నాడని నాకు తెలియదు' అని ప్రకాశ్ రాజ్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. తన దగ్గరకు వచ్చిన పాత్రల్లో తాను నటిస్తున్నాను తప్ప.. తనలో నటుడున్నాడనే సంగతి తెలియదని.. తాను క్రియేటర్ అయితే ఆ విషయం తెలిసేదని అన్నారు.
"ముక్బీర్" గురించి మాట్లాడుతూ.. ఓ గూఢచారి అస్థిత్వాన్ని ప్రశ్నించే నేపథ్యంగా కథ సాగుతుందని ప్రకాశ్ రాజ్ తెలిపారు. నేను ఇంకా పుట్టని సమయంలో జరిగిన కొన్ని మరుగున పడిన సంఘటనలను తెరపైన ఆవిష్కరించనున్నామని పేర్కొన్నారు. ఈరోజు మనం స్వేచ్ఛగా బతుకుతున్నానంటే.. అందుకు కారణం దేశం కోసం ప్రాణాలిచ్చిన త్యాగధనులే. అలాంటి వారిలో కొందరు మనకు తెలియదు. వారి గురించి ఈ చిత్రంలో చెబుతున్నామని అన్నారు.
దేశాన్ని ఎన్నో సంఘటనలు.. ఎన్నో విషయాలు ముందుకు నడిపిస్తుంటాయి. ఒకరి ఐడియాలజీ.. ఓ పార్టీ.. ఓ నేత దేశానికి స్పూర్తినిస్తారు. ఈ దేశంలో బతికే ప్రతీ వ్యక్తి దేశభక్తుడే. వారు తమ దేశానికి ఏదో రూపంలో ఎన్నో సేవలు అందిస్తారు. వారి గురించి మనం ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని ప్రకాశ్ రాజ్ పేర్కోన్నారు.
సినీ ఇండస్ట్రీలో మాఫియా అనే పదం క్రేజీగా వినిపిస్తుందని ప్రకాష్ రాజ్ అన్నారు. సినిమా అనేది ఒక మాధ్యమం. అది ఒక నదీ ప్రవాహంలా సాగుతుంది. ఆ ప్రవాహంతో ప్రేక్షకులు సాగిపోవాల్సిందే. అయితే రెండు గంటలపైగా నడిచే సినిమాపై అనేక ఆంక్షలు ఉండేవి. ముందుగా టీవీలో రిలీజ్ ఎలా చేస్తారని అడ్డుకొనే వారు. కానీ కరోనా పాండమిక్ కారణంగా అలాంటి మాఫియాకు ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పుడు ఓటీటీ రూపంలో ప్రేక్షకులు తమకు నచ్చిన కంటెంట్ ను చూస్తున్నారు అని కీలక వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.
ఇకపోతే గూడచార్యం నేపథ్యంలో తెరకెక్కిన "ముక్బీర్" సినిమా జీ5లో నవంబర్ 11వ తేదీన రిలీజ్ కానుంది. ఇందులో ప్రకాశ్ రాజ్ తోపాటు జైన్ ఖాన్ దురానీ - ఆదిల్ హుస్సేన్ తదితరులు నటిస్తున్నారు. శివమ్ నాయర్ - జయప్రద్ దేశాయ్ దర్శకత్వం వహించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.