Begin typing your search above and press return to search.

శరణ్య తన మాజీ భార్య అనే విషయంపై స్పందించిన విలన్!

By:  Tupaki Desk   |   27 Jan 2022 11:30 PM GMT
శరణ్య తన మాజీ భార్య అనే విషయంపై స్పందించిన విలన్!
X
తెలుగు తెరకి పరిచయమైన విలన్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకమై న స్థానాన్ని దక్కించుకున్న విలన్ గా సంపత్ రాజ్ కనిపిస్తారు. చూడటానికి చాలా సింపుల్ గా కనిపిస్తూనే పవర్ఫుల్ విలనిజాన్ని పండించే ప్రతినాయకుడిగా ఆయన మంచి మార్కులను కొట్టేశారు. పదునైన చూపులతో .. కరుకైన డైలాగులతో హీరోయిజాన్ని ఎదుర్కొనే విలన్ గా ఆయన అభిమానుల మనసులను గెలుచుకున్నారు. 'సన్నాఫ్ సత్యమూర్తి' .. 'సోగ్గాడే చిన్నినాయనా' .. 'శ్రీమంతుడు' .. 'రాజా ది గ్రేట్' వంటి సినిమాలు అందుకు నిదర్శనంగా నిలుస్తాయి.

ఇక 'భీష్మ' సినిమాలో సంపత్ రాజ్ తనలోని మరో కోణాన్ని చూపించారు. ఆ సినిమాలో కథానాయిక తండ్రి పాత్రలో ఆయన కామెడీని కూడా పండించారు. ఈ తరహా పాత్రలను కూడా తాను బాగా చేయగలనని నిరూపించారు. అలాంటి సంపత్ రాజ్ 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొని, అనేక ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్రోమో రన్ అవుతోంది. ఈ కార్యక్రమంలో సంపత్ రాజ్ మాట్లాడుతూ, " పెళ్లికి ముందు మా ఫాదర్ .. మదర్ మా అమ్మగారిని కలుసుకోవడం గమ్మత్తుగా జరిగింది.

మా నాన్నగారు పోలీస్ .. అందువలన మా అమ్మను చూడటానికి యూనిఫామ్ తోనే వాళ్లింటికి వెళ్లారట. అలా రమ్మని చెప్పి మా అమ్మగారి వాళ్ల నాన్న అనడం వల్లనే ఆయన అలా వెళ్లారు. ఆ సమయంలో మా అమ్మగారు ఇల్లు తుడుస్తోంది .. అప్పుడు ఆయన ఆమెను చూసి పనిమనిషి అనుకున్నారు. ఇక మా ఫాదర్ ను చూసి ఎవరో పోలీస్ వచ్చారంటూ మా అమ్మగారు అక్కడి నుంచి లోపలికి పరిగెత్తారు. అలా వాళ్లిద్దరూ ఒకరినొకరు చూసుకోవడం జరిగింది. వాళ్లకి ఏడుగురు సంతానం .. అందులో నేనే చివరివాడిని" అంటూ చెప్పుకొచ్చారు.

ఇక తనపై .. సీనియర్ ఆర్టిస్ట్ శరణ్య పై వచ్చిన పుకారును గురించి సంపత్ రాజ్ స్పందిస్తూ .. "మా ఫ్యామిలీ .. శరణ్యగారి ఫ్యామిలీ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. శరణ్యగారి భర్త .. ఆమె కూతుళ్లు కూడా నాతో చాలా క్లోజ్ గా ఉంటారు. ఒక సినిమాలో నేను .. శరణ్యగారు భార్య భర్తలుగా నటించాము. ఆ ఫొటో పెట్టేసి ఆమె నా ఎక్స్ వైఫ్ అని రాసేశారు. ఇక ఇలాంటివాటికి ఏం చెబుతాం చెప్పండి? అంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇక చదువులేనివాడు .. పనీపాటా లేనివాడే సినిమాల్లోకి వెళతాడని మా అమ్మకి ఉండేది. అప్పుడు మా నాన్న చెప్పింది ఒకేమాట .. మీ అమ్మకి భయపడుతూ ఇలాగే ఉంటే నువ్వెప్పటికీ సినిమాల్లోకి వెళ్లలేవు .. ఇంట్లో నుంచి పారిపో" అన్నారు అంటూ నవ్వేశారు. త్వరలో ప్రసారం కానున్న పూర్తి ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా ఉండేలా ఉంది.