Begin typing your search above and press return to search.

ఎటెర్న‌ల్స్ టీజ‌ర్: వింత‌లు మాయ‌ల సూప‌ర్ హీరోల‌ విజువ‌ల్ ప్ర‌పంచం

By:  Tupaki Desk   |   25 May 2021 3:35 AM GMT
ఎటెర్న‌ల్స్ టీజ‌ర్: వింత‌లు మాయ‌ల సూప‌ర్ హీరోల‌ విజువ‌ల్ ప్ర‌పంచం
X
మాయ‌లు మంత్రాలు వింత‌లు విశేషాలు చూడాలంటే ఒక‌ప్పుడు విఠ‌లాచార్య సినిమాలు చూడాల‌ని అనేవారు. ఆ త‌ర్వాత చాలామంది ద‌ర్శ‌కులు ఆయ‌న‌ను అనుక‌రించి మాంత్రికతాంత్రిక విద్య‌ల్ని తెర‌పై చూపించి అబ్బుర‌ప‌రిచారు. నాడు గ్రాఫిక్స్ లేని రోజుల్లోనే ఎంతో గొప్ప విజువ‌ల్ క్రియేష‌న్ ని చూపించారు.

హ్యారీపోట‌ర్ సిరీస్ తో హాలీవుడ్ విజువ‌ల్ ప్ర‌పంచం మ‌రో స్థాయికి వెళ్లిపోయింది. సాంకేతిక‌త‌లో అత్యున్న‌తంగా అల‌రించిన ఈ సిరీస్ కి భిన్నంగా మ‌రో లెవ‌ల్ ని ట‌చ్ చేస్తూ సూప‌ర్ హీరో సినిమాలు పుట్టుకొచ్చాయి. మార్వెల్ స్టూడియోస్ సినిమాలన్నీ విజువ‌ల్ బ్రిలియ‌న్సీతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ఆడియెన్ ని మాయ చేస్తున్నాయి.

ఇప్పుడు అదే కేట‌గిరీలో ఎటర్నల్స్ న‌వంబ‌ర్ లో రిలీజ్ కానుంది. తాజాగా ఎటెర్న‌ల్స్ టీజర్ ను ఆవిష్కరించారు. ఇది అవెంజర్స్ కాకుండా కొత్త సూపర్ హీరోల చిత్రం. ఒక మహాసముద్రం నుంచి భూమి వైపుగా దూసుకొచ్చిన ఒక భారీ ప‌ల్లెంలాంటి వాహ‌నం అబ్బుర‌ప‌రుస్తుంది. అక్కడ నివసించే ప్రజలు నిరాశలో ఉన్నారు.

ఒక మాయా అంతరిక్ష నౌక అది అని తెలుసుకుంటారు. ఇది కొత్త ఆశను ఇస్తుంది. ఆర్టిస్టులంతా సూప‌ర్ ప‌వ‌ర్స్ ఉన్న వాళ్లే. వారి న‌డుమ వింతైన విజువ‌ల్ ప్ర‌పంచాన్ని క్రియేట్ చేసిన తీరు ఆస‌క్తిక‌రం. ఈ టీజర్ లో సల్మా హాయక్- ఏంజెలీనా జోలీ- గేమ్ ఆఫ్ థ్రోన్స్ నటులు రిచర్డ్ మాడెన్, కిట్ హారింగ్టన్ త‌దిత‌రులు క‌నిపిస్తారు. టీజర్ సల్మా హాయక్ వాయిస్ఓ వర్ నేపథ్యంలో నడుస్తుంది. ఈ చిత్రంలో పాకిస్తానీ నటుడు కుమాయిల్ నంజియాని కూడా నటించారు. టీజర్ లో ఇండియన్ టచ్ కూడా ఉంది.

``మేము చూశాం.. మార్గనిర్దేశం చేసాం. మేము వారికి పురోగతికి సహాయం చేసాం. వారు అద్భుతాలు సాధించడాన్ని చూశాం. సంవత్సరాలుగా.. మేము ఇప్పటివరకు జోక్యం చేసుకోలేదు`` అంటూ ఎంతో మార్మిక‌మైన సంభాష‌ణ ఆక‌ట్టుకుంటుంది. ఆస్కార్ విజేత క్లో జావో ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మార్వెల్ ప్రమాణాలకు ధీటైన విజువ‌ల్స్ టీజ‌ర్ లో అబ్బుర‌ప‌రిచాయి. ఈ చిత్రం నవంబర్ లో విడుదల కానుంది. భార‌త‌దేశంలోనూ ఈ చిత్రం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ్ చేయాలంటే కోవిడ్ ప‌రిస్థితులు నిర్ధేశిస్తాయి.