Begin typing your search above and press return to search.
'ది వారియర్' కలెక్షన్స్: టాక్ తో సంబంధం లేకుండా రామ్ ర్యాంపేజ్..!
By: Tupaki Desk | 15 July 2022 10:30 AM GMTఎనర్జిటిక్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ యాక్షన్ మూవీ ''ది వారియర్''. కోలీవుడ్ మాస్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కింది. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫస్ట్ డే మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అయినప్పటికీ టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ రాబడుతోంది.
'ది వారియర్' సినిమా ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో రూ. 7 కోట్లకు పైగా షేర్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. రామ్ కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ లో ఇదొకటి. నైజాంలోనే దాదాపు రెండు కోట్ల వరకూ వసూలు చేయగా.. సీడెడ్ - వైజాగ్ - గుంటూరు ఏరియాలలో కోటికి పైగా కలెక్ట్ చేసింది. మొత్తం మీద వరల్డ్ వైడ్ గా ఓపెనింగ్ డే నాడు రామ్ సినిమా రూ. 8.73 కోట్లు అందుకున్నట్లు తెలుస్తోంది.
* ప్రపంచ వ్యాప్తంగా 'ది వారియర్' మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ వివరాలు పరిశీలిస్తే...
నిజాం - 1.96 కోట్లు
సీడెడ్ - 1.04 కోట్లు
ఈస్ట్ - 51 లక్షలు
వెస్ట్ - 67 లక్షలు
కృష్ణ - 38 లక్షలు
నెల్లూరు - 29 లక్షలు
వైజాగ్- 1.02 కోట్లు
గుంటూరు - 1.19 కోట్లు
AP/TS మొత్తం - 7.06 కోట్లు
తమిళనాడు - 94 లక్షలు
కర్ణాటక - 32 లక్షలు
ఓవర్ సీస్ - 41 లక్షలు
వరల్డ్ వైడ్ టోటల్ - 8.73 కోట్లు
'ది వారియర్' చిత్రంలో రామ్ సత్య అనే పోలీసుగా డాక్టర్ గా కనిపించి మెప్పించాడు. సినిమాలోని యాక్షన్ సీన్స్ మరియు మాస్ సాంగ్స్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి. మరో పెద్ద సినిమా లేకపోవడంతో ఈ వారాంతంలో మరిన్ని వసూళ్ళు రాబట్టే అవకాశం ఉంది.
ఇందులో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ప్రతినాయకుడు గురు గా ఆది పిన్నిశెట్టి నటించగా.. అక్షర గౌడ - నదియా - జయ ప్రకాష్ కీలక పాత్రల్లో కనిపించారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.
రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చగా.. సుజీత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేశారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాసిన ఈ చిత్రంలో అన్బురివ్ - విజయ్ మాస్టర్స్ యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు.