Begin typing your search above and press return to search.

దేశం మొత్తం ఇప్పుడు పుష్ప వైపు.. పాన్ ఇండియా సూపర్ స్టార్

By:  Tupaki Desk   |   31 Jan 2022 8:30 AM GMT
దేశం మొత్తం ఇప్పుడు పుష్ప వైపు.. పాన్ ఇండియా సూపర్ స్టార్
X
బాహుబలి.. సాహో సినిమాలతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌ హీరోగా పేరు దక్కించుకున్నాడు. బాహుబలి సినిమా క్రెడిట్ రాజమౌళికి ఎక్కువ వెళ్తుంది.. అయితే సాహో సక్సెస్ క్రెడిట్‌ ప్రభాస్ కే పూర్తిగా దక్కుతుంది అనడంలో సందేహం లేదు. ప్రభాస్‌ పాన్ ఇండియా స్థాయిలో ప్రస్తుతం సూపర్‌ స్టార్‌ స్టార్‌ డమ్ ను అనుభవిస్తున్నాడు. ఇప్పుడు రెండవ పాన్ ఇండియా సూపర్‌ స్టార్‌ గా అల్లు అర్జున్‌ నిలిచాడు.

సౌత్‌ నుండి ఒక డబ్బింగ్ సినిమా తో ఉత్తరాదిన వంద కోట్లు అంతకు మించి వసూళ్లు సాధించింది కేవలం ఇద్దరే హీరోలు. వారు ప్రభాస్‌ మరియు అల్లు అర్జున్‌. పుష్ప సినిమా నిన్నటి తో హిందీ వర్షన్ వంద కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది. అమెజాన్ లో స్ట్రీమింగ్‌ అవుతున్నా కూడా అభిమానులు మరియు సినీ ప్రేమికులు థియేటర్లలో ఇంకా చూస్తూనే ఉన్నారు. హిందీ వర్షన్‌ పుష్ప నలబై రోజులు దాటిన తర్వాత కూడా ప్రతి రోజు 30 నుండి 40 లక్షల వసూళ్లను దక్కించుకుంటూ మెల్ల మెల్ల గా వంద కోట్ల మార్క్ ను టచ్ చేసింది.

పుష్ప సినిమా కు ఉత్తరాదిన ప్రమోషన్‌ చేసిందే లేదు. అసలు అక్కడ విడుదల అవుతుందా లేదా అనే అనుమానాల మద్య చివరి నిమిషంలో విడుదల అయ్యింది. పుష్ప సినిమా ను హిందీ లో విడుదల చేయాల్సిందే అంటూ అభిమానులు పోరు పెట్టడంతో అప్పుడు థియేటర్‌ రిలీజ్ కు సిద్దం అయ్యారు. మొదట సినిమా కు నెగటివ్‌ రివ్యూలు వచ్చాయి.. మొదటి రెండు రోజులు కనీసం పాతిక శాతం ఆక్యుపెన్సీ కూడా రాలేదు అనే ట్రోల్స్ వచ్చాయి.

అలా మొదలు అయిన హిందీ పుష్ప ప్రభంజనం ఏకంగా వంద కోట్ల వరకు అద్బుతంగా సాగింది. పుష్ప సినిమాలోని డైలాగ్స్ మరియు శ్రీవల్లి స్టెప్పును ఎంతో మంది ప్రముఖ క్రికెటర్స్ ఇంకా సోషల్‌ మీడియా స్టార్స్ అనుకరించడంతో పుష్ప సినిమా పై జనాల్లో ఆసక్తి కనిపించింది. అల్లు అర్జున్‌ నటనకు ఉత్తరాది ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దేశ వ్యాప్తంగా కూడా బన్నీ తన నటన గురించి చర్చించుకునేలా చేశాడు. ఇలాంటి ఒక అద్బుతమైన ఆధరణ ప్రభాస్ కు కూడా దక్క లేదు అంటూ అల్లు అభిమానులు సోషల్‌ మీడియా ద్వారా చర్చించుకుంటున్నారు.

పుష్ప సినిమాలో అల్లు అర్జున్‌ నటన చాలా నాచురల్‌ గా ఉండటం మాత్రమే కాకుండా ఆయన మ్యానరిజం ఉత్తరాది ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందుకే సినిమాలు లేని ఈ సమయంలో పుష్ప సినిమా ను వారు విపరీతంగా ఆధరించారు. తద్వారా వంద కోట్ల వసూళ్లు నమోదు అయ్యాయి. లాంగ్ రన్ లో ఇంత వసూళ్లను దక్కించుకోవడం పుష్ప కే దక్కింది. బాహుబలి అయినా సాహో అయినా ఓపెనింగ్స్ తోనే భారీ వసూళ్లు దక్కించుకుంది. కాని పుష్ప మాత్రం ఓపెనింగ్స్ వీక్ గా స్టార్ట్‌ అయ్యి లాంగ్‌ రన్‌ లో వంద కోట్ల వసూళ్లు నమోదు చేసింది.

ఈ లెక్కన చూస్తే పుష్ప సినిమా ముందు ఆ సినిమాలు చిన్నబోయినట్లే అంటూ బన్నీ అభిమానులు నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. భవిష్యత్తులో పాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్ గా అల్లు అర్జున్‌ నిలవడం ఖాయం. అల్లు అర్జున్‌ పుష్ప 2 తో పాన్ ఇండియా మార్కెట్ ను శాసించేందుకు పుష్ప పార్ట్‌ 1 ఒక అద్బుతమైన ప్లాట్‌ ఫామ్‌ ను సెట్‌ చేసింది. పుష్ప 2 ను భారీ ఎత్తున ప్రమోట్‌ చేస్తే ఖచ్చితంగా వంద కోట్లకు మించిన వసూళ్లు దక్కించుకునే అవకాశం ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు నమ్ముతున్నారు. అల్లు అర్జున్‌ పుష్ప పార్ట్‌ 2 షూటింగ్‌ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంది. సుకుమార్‌ అందుకోసం అన్ని ఏర్పాట్లు చేశాడు.