Begin typing your search above and press return to search.

దిగ్గ‌జ న‌టుడి మ‌ర‌ణంపై దేశం మొత్తం క‌దిలింది!

By:  Tupaki Desk   |   7 July 2021 10:44 AM GMT
దిగ్గ‌జ న‌టుడి మ‌ర‌ణంపై దేశం మొత్తం క‌దిలింది!
X
బాలీవుడ్ లెజెండ‌రీ న‌టుడు దిలీప్ కుమార్ అస్త‌మ‌యం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ఆయ‌న అభిమానుల్లో విషాదం నింపిన సంగ‌తి తెలిసిందే. నేడు దేశం మూగ‌వోయింది. అభిమానులంతా దుఖఃసాగ‌రంలోకి జారుకున్నారు. దిగ్గ‌జ న‌టుడితో త‌మ‌కున్న అనుబంధాల్ని గుర్తు చేసుకుంటూ బాలీవుడ్ మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది. దేశం మొత్తం ట్విట‌ర్ వేదిక‌గా ఘ‌న నివాళులు అర్పిస్తోంది. సినీ రాజ‌కీయ‌ పారిశ్రామిక రంగాల నుంచే కాకుండా ప్ర‌తీ అభిమాని ప్రేక్ష‌కుడు దిలీప్ కుమార్ మ‌ర‌ణంపై త‌మ‌దైన శైలిలో సంతాపం ప్ర‌క‌టిస్తున్నారు. దిలీప్ కుమార్ పాత త‌రం న‌టులైనా.. పాకిస్తాన్ నుంచి ఇండియా వ‌చ్చి స్థిర‌ప‌డినా భార‌తదేశంతో ఆయ‌న‌కున్న అనుబంధం ఇక్క‌డ ఉన్న ఫాలోయింగ్ ఎంతో ప్ర‌త్యేకమైన‌వి.

పాకిస్తాన్ లో యూస‌ఫ్ ఖాన్ గా పేరుగాంచిన ప‌రిశ్ర‌మ‌లోకి వ‌చ్చి దిలీప్ కుమార్ గా పేరు మార్చుకుని...కోట్లాది మంది అభిమానుల గుండెల్లో చిర స్థాయిగా నిలిచిపోయారు. అంత గొప్ప లెజెండ‌రీని కోల్పోవ‌డంతో దేశం మొత్తం క‌దిలింది. భార‌త సినీ చ‌రిత్ర‌ను దిలీప్ కుమార్ కు ముందు త‌ర్వాత రాయాల‌ని బిగ్ బీ అమితాచ్చ‌న్ సంతాపం ప్ర‌క‌టించారు. భార‌తీయ సినిమాకు ఆయ‌న ఓ లెజెండ్. ఆయ‌న ఎప్ప‌టికీ చిరంజీవిగా మిగిలిపోతార‌ని మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మెహ‌న్ లాల్ నివాళులు అర్పించారు.

అస‌మాన తేజ‌స్సు ఆయ‌న సొంతం. సాంస్కృతిక ప్ర‌పంచానికి ఆయ‌న మ‌ర‌ణం తీర‌న‌లి లోటు అని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ట్విట‌ర్ వేదిక‌గా నివాళులు అర్పించారు. రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్.. ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు నివాళులు అర్పించారు. దీలిప్ కుమార్ అభిన‌యం ఒక విశ్వ విద్యాల‌యం అంటూ ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్,... భార‌తీయ సినిమాకు ఆయ‌న అందించిన సేవ‌లు భ‌విష్య‌త్ త‌రాల‌కు గుర్తుండిపోతాయంటూ కాంగ్రేస్ నేత రాహుల్ గాంధీ ట్విట‌ర్ లో తెలిపారు.

భార‌తీయ సినీచ‌రిత్ర‌లో ఒక శ‌కం ముగిసింది.. లెజెండ్ దిలీప్ కుమార్ సాబ్ మ‌ర‌ణించినందుకు చాలా విచారంగా ఉంది. భార‌త‌దేశం గ‌ర్వించ‌ద‌గ్గ గొప్ప న‌టుడు నిర్మాత ఆయ‌న‌. యాక్టింగ్ స్టూడియో ..నేష‌న‌ల్ ట్రెజ‌ర్ ఆయ‌న‌.. ప్ర‌పంచానికి ఆయ‌న న‌టుడిగా ఎంతో వినోదం పంచారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాలి.. అని మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలిపారు. దిలీప్ కుమార్ తో క‌లిసి ఉన్న నాటి క్లాసిక్ ఫోటోని చిరు ట్విట్ట‌ర్ లో షేర్ చేశారు.

అది అతడు కాకపోతే పిల్లలు చాలా మందికి సుప్రీం ఆర్టిస్ట్ అంటే అర్థం తెలియదు - నిన్నటి తరం ఎల్లప్పుడూ గొప్పదని భావించే నటుడు. సినిమాతో ప్రేమలో పడే భాగ్యం మాకు లభించింది అంటే.. కొలవలేని కొలతలో దిలీప్ కుమార్ కారణంగా.. మేము యూసుఫ్ ఖాన్‌తో ప్రేమలో పడ్డాము.

`ది ట్రాజెడీ కింగ్` కిరీటాన్ని ధరించిన వ్యక్తితో మేము ప్రేమలో పడ్డాం. అతను తన ప్ర‌తిభ స‌త్తువ‌ను క్లాసిక్ క్వాలిటీతో.. అందంగా చెక్కారు.
అతడి మేజిక్ కు పులకరించిన ప్రతి పురుషుడు స్త్రీ కళ్ళ నుండి ఈ రోజు కన్నీళ్లు వస్తున్నట్లుగా.. అతిశయోక్తి ప్రవహిస్తుంది. మల్టీప్లెక్స్ లను సమీకరించే మిలీనియల్స్ వారి పెద్దలు చేసినట్లు ఎప్పటికీ అదృష్టం పొందలేవు. ఇంతకుముందు లేదా డిజిటల్ తరం ఏ నటుడిని ఆయ‌న‌తో పోల్చొద్దు. ఎవరితోనైనా అతనితో పోల్చడం నిజమైనదాన్ని నకిలీ నాణెంతో పోల్చడం లాంటిది... అంటూ దిలీప్ కుమార్ స్నేహితులు అశోక్ ఎమోష‌న‌ల్ అయ్యారు.

మ‌ధ్య‌త‌ర‌గ‌తి బ‌తుకు.. కోపం .. క‌ష్టం న‌ష్టం.. ఎమోష‌న్ ఆయ‌న న‌ట‌న‌లో నాకు తెలుసు. ఒకప్పుడు దిలీప్ కుమార్ ప్రేమ‌కావ్యాల‌ను చూడ‌టానికి ఎంతో ఆస‌క్తిగా వేచి చూసిన ప్రేక్ష‌కులు ఉన్నారు. నేటి డిజిట‌ల్ త‌రంలోనూ ఆయ‌న సినిమాల‌ను ఆస‌క్తిగా చూస్తారు.. అని ఆయ‌న తెలిపారు.