Begin typing your search above and press return to search.
డ్రగ్స్ కేసు: హీరోయిన్ల ఆర్థిక లావాదేవీల పై ఈడీ విచారణ...!
By: Tupaki Desk | 1 Oct 2020 10:10 AM GMTకన్నడ చిత్ర సీమను డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తోంది. డ్రగ్స్ మాఫియాతో శాండల్ వుడ్ లో పలువురు నటీనటులకు సంబంధాలు ఉన్నాయని ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో హీరోయిన్లు రాగిణి ద్వివేది - సంజన గల్రానిలను కూడా డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఇక డ్రగ్స్ వ్యవహారాల్లో రాగిణి - సంజనల ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు చేయడానికి ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. ఈ క్రమంలో వీరిద్దరిని ఈడీ అధికారులు విచారించారు. సంజనకు చెందిన 11 బ్యాంక్ ఖాతాల నుంచి నగదు వివిధ ఖాతాలకు బదిలీ అయిన్నట్లు గుర్తించిన ఈడీ.. అన్ని ఖాతాలలో కలిపి 40 లక్షల రూపాయలు ఉన్నట్లు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎవరెవరి ఖాతాల నుంచి సంజన ఖాతాకు డబ్బులు జమ అవుతున్నది బదిలీ అవుతున్నది కూపీ లాగుతున్నారని తెలుస్తోంది.
అయితే బెంగళూరులో గతేడాది అనేక మందిని మోసం చేసి బోర్డు తిప్పేసిన ఐఎంఏ అధినేత మన్సూరుఖాన్ సంస్థలో తాను భారీ మొత్తంలో డిపాజిట్స్ చేసి మోసపోయినట్లు సంజన ఈడీ విచారణలో వెల్లడించినట్లు సమాచారం. అంతేకాకుండా అధిక వడ్డీల కోసం ఇతరుల మాట విని పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి నష్టపోయినట్లు సంజన చెప్పినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా డ్రగ్స్ కేసులో రాగిణి ద్వివేది - సంజన గల్రాని పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సస్ యాక్ట్ ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేసింది. బెయిల్ మంజూరు చేయడానికి కోర్టు నిరాకరించడంతో రాగిణి - సంజనలు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్లనున్నారు.