Begin typing your search above and press return to search.
సంక్రాంతి తేలింది..ఇక హంగామా అంతా సమ్మర్ దేనా?
By: Tupaki Desk | 20 Jan 2023 4:30 AM GMTప్రతీ ఏడాది సంక్రాంతి వస్తోందంటే తెలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ లో సందడి చేస్తుంటాయి. భారీ సినిమాలతో స్టార్ హీరోలు పోటీ పోటీగా పోటీపడుతుంటారు. గత ఏడాది కోవీడ్ థర్డ్ వేవ్ భయాల కారణంగా భారీ సినిమాలేవీ పోటీపడలేదు. దీంతో గత ఏడాది సంక్రాంతి చాలా నీరసంగా సాగింది. దీంతో అందిరి దృష్టన 2023 సంక్రాంతిపై పడింది. అంతా అనుకున్నట్టుగానే ఈ సంక్రాంతికి టాలీవుడ్ అగ్ర కథానాయకులు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ పోటీ పడ్డారు.
నందమూరి బాలకృష్ణ 'వీర సింహారెడ్డి'తో జనవరి 12న బరిలోకి దిగితే.. మెగాస్టార్ చిరంజీవి 'వాల్తేరు వీరయ్య'తో జనవరి 13న సంక్రాంతి బరిలో దిగారు. ఈ రెండు సినిమాలతో రెండు తమిళ డబ్బింగ్ సినిమాలు, ఓ చిన్న సినిమా విడుదలైనా బాక్సాఫీస్ వద్ద ఈ రెండు సినిమాలకు మించి సందడి చేయలేకపోయాయి. నందమూరి బాలకృష్ణ 'వీర సింహారెడ్డి' యావరేజ్ హిట్ గా నిలవగా, మెగాస్టార్ చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' హిట్ అనిపించుకుంది.
బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని రాబడుతూ సంక్రాంతి విజేతగా నిలిచింది. ఇక డబ్బింగ్ సినిమాల్లో అజిత్ నటించిన 'తెగింపు' అడ్రస్ లేకుండా పోగా.. విజయ్ నటించిన 'వారసుడు' ఫరవాలేదనిపించింది. గత ఏడాది సంక్రాంతికి పెద్దగా సినిమాలు రాకపోవడంతో అందరూ 2023 సంక్రాంతిపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశలకు తగ్గట్టే చిరు 'వాల్తేరు వీరయ్య' హిట్ అనిపించుకోగా నందమూరి బాలకృష్ణ నటించిన 'వీర సింహారెడ్డి' యావరేజ్ అనిపించుకుంది.
దీంతో ఈ రెండు సినిమాలు సంక్రాంతి సమయంలో నిలిచి ప్రేక్షకుల నమ్మకాన్ని నిజం చేశాయి. ఇదిలా వుంటే సంక్రాంతి సినిమాల ఫలితం తేలిపోవడంతో ఇప్పుడందరి దృష్టి తరువాత రానున్న సినిమాలపై పడింది. అయితే ఈ రెండు భారీ చిత్రాల తరువాత థియేటర్లలోకి పెద్ద సినిమాలు వచ్చే అవకాశం లేదు. కారణం అన్నీ సమ్మర్ కే రిలీజ్ కానున్నాయి కాబట్టి. సమ్మర్ కు ముందు చిన్న ఓ మోస్తారు సినిమాలతో పాటు బుట్టబొమ్మ, సుధీర్ బాబు హంట్, సమంత 'శాకుంతలం' రిలీజ్ కాబోతున్నాయి.
ఇందులో ఈ నెలలో బుట్టబొమ్మ, సుధీర్ బాబు 'హంట్' రిలీజ్ కాబోతున్నాయి. వచ్చే నెలలో ధనుష్ 'సార్', గుణశేఖర్, సమంతల 'శాకుంతం' రాబోతున్నాయి. ఇక భారీ సినిమాల హంగామా మాత్రం వేసవికే వుండబోతోంది. సమ్మర్ లో వినోదాన్ని అందించడానికి చిరు భోళా శంకర్, రవితేజ 'రావణాసుర', పవన్ కల్యాణ్ 'హరి హర వీరమల్లు', నేచురల్ స్టార్ నాని 'దసరా' సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈ సినిమాల సందడి సంక్రాంతికి మించి వుండబోతున్నట్టుగా తెలుస్తోంది. బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరగనుండటంతో టాలీవుడ్ మొత్తం సమ్మర్ కోసం ఎదురు చూస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.