Begin typing your search above and press return to search.

కౌగిలించుకుని అందరి నోళ్లు మూయించిన పాప్ సింగ‌ర్ వైఫ్!

By:  Tupaki Desk   |   18 Oct 2022 9:48 AM GMT
కౌగిలించుకుని అందరి నోళ్లు మూయించిన పాప్ సింగ‌ర్ వైఫ్!
X
పాప్ సింగ‌ర్ జ‌స్టిన్ బీబ‌ర్ సంచ‌ల‌నాలు ప్ర‌పంచానికి తెలిసింది. అతి చిన్నవయసులోనే రాక్ స్టార్‌గా మారి ప్రపంవచ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. త‌న పాప్ సాంగ్స్ తో ప్ర‌పంచాన్ని సంగీతంలో ముంచేయ‌డం బీబ‌ర్ కే చెల్లింది. అలాగే ఎఫైర్ల విష‌యంలోనూ బీబ‌ర్ హాట్ టాపిక్ గా క‌నిపిస్తుంటారు.

కొన్నాళ్ల పాటు పాప్ చిన్నది సెలెనా గోమెజ్‌తో బీబ‌ర్ పీక‌ల్లోతూ ప్రేమ‌లో మునిగి తేలాడు. దాదాపు నాలుగేళ్ల పాటు ఇద్ద‌రి రిలేష‌న్ సాగింది. ఆ త‌ర్వాత మ‌నస్ప‌ర్ధ‌లు త‌లెత్త‌డంతో వేర‌య్యారు. అటుపై జ‌స్టిన్ బీబ‌ర్ హెయిలీ బాల్డ్ విన్ తో ప్రేమ‌లో ప‌డ‌టం..ఆమెను వివాహం చేసుకోవ‌డం జ‌రిగింది.

అయితే బీబర్ ని వివాహం చేసుకున్నప్పటి నుంచి అతడి భార్య హెయిలీపై సోషల్ మీడియాలో తరచూ ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. హెయిలీని బీబర్ మాజీ ప్రియురాలు సెలీనాతో పేల్చుతూ కామెంట్స్ చేయ‌డం ప‌రిపాటిగా మారింది. హెయిలీ అందవికారంగా ఉంది. ఆమెని బీబర్ ఎలా ఇష్టపడ్డాడు అంటూ ఇష్టానుసారం కామెంట్లు ప‌డ్డాయి.

ఈ క్రమంలో సెలీనా- హెయిలీ మ‌ధ్య మాట‌ల యుద్దం సైతం జ‌రిగింద‌ని ఇప్ప‌టికీ క‌థ‌నాలు వెడెక్కిస్తూనే ఉంటాయి. తాజాగా ఒక ఫోటోతో అంద‌రి నోళ్లు మూయించింది బీబీర్ వైఫ్. లాస్ ఏంజిల్స్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాప్ సింగర్ జస్టిన్ బీబర్ భార్య మరియు అతని మాజీ ప్రియురాలు కౌగిలించుకుని కలిసి కెమెరాకి పోజులిచ్చారు. ఈ స‌న్నివేశం సెలీనా అభిమానులు స‌హా జస్టిన్ బీబర్‌కు కూడా కంగుతినే అంశంగా మారింది.

ఇటీవ‌లి జ‌రిగిన పోడ్‌కాస్ట్ ‘కాల్ హర్ డాడీ’లో హేలీ బీబర్ తనకు మరియు సెలీనా గోమెజ్‌కు మధ్య ఎలాంటి విబేధాలు లేవ‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టింది. 'అదంతా గౌరవం. అదంతా ప్రేమ. … గౌరవం తప్ప మేమిద్దరం ఎవరికీ ఏమీ రుణపడి ఉండము. నేను ఆమెను చాలా గౌరవిస్తాను. మా మధ్య ఎటువంటి స‌మ‌స్య‌లు లేవు. నేను మెను గౌర‌విస్తాను. ఆమె న‌న్ను అంతే రెస్ప‌క్ట్ చేస్తుంది' అని రివీల్ చేసింది. దీంతో అన్ని ర‌కాల పుకార్ల‌కు పుల్ స్టాప్ ప‌డింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.