Begin typing your search above and press return to search.

గాలి వార్తే నిజం! హీరోయిన్ తో యంగ్ హీరో పెళ్లి!!

By:  Tupaki Desk   |   26 March 2022 3:30 PM GMT
గాలి వార్తే నిజం! హీరోయిన్ తో యంగ్ హీరో పెళ్లి!!
X
నిన్నటివ‌ర‌కూ గాలి క‌బురు.. నేడు అదే నిజం. ఎట్ట‌కేల‌కు గాసిప్ మాత్ర‌మేన‌ని భావించిన వారికి షాకిస్తూ తాను ప్రేమించిన అందాల హీరోయిన్ ని ఆది పినిశెట్టి పెళ్లాడేస్తున్నాడు. ప్రియురాలు నిక్కీ గ‌ర్లానీతో నిశ్చితార్థం జ‌రిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి.

నిజానికి ఆది పినిశెట్టికి నిక్కీ గ‌ర్లానీకి ఇంట్ర‌డ‌క్ష‌న్ అవ‌స‌రం లేదు. ఆ ఇద్ద‌రూ తెలుగు ఆడియెన్ కి సుప‌రిచితం. 'రంగస్థలం' లో రామ్ చరణ్‌కి అన్నయ్యగా నటించిన ఆది పినిశెట్టి గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా నిక్కీ గ‌ర్లానీతో నిండా ప్రేమ‌లో మునిగి ఉన్నాడు. ఇప్పుడు నిశ్చితార్థం జరిగింది. నిక్కీ ఇంత‌కుముందు సునీల్ నటించిన 'కృష్ణాష్టమి' అలాగే.. ఆది పినిశెట్టి స‌ర‌స‌న 'మలుపు' చిత్రాల్లో కథానాయికగా న‌టించింది.

బుజ్జిగాడు ఫేమ్ సంజ‌నా గల్రానీకి నిక్కీ తోబుట్టువు అన్న సంగ‌తి తెలిసిందే. తెలుగు ప్రేక్షకులకు తెలిసిన కోలీవుడ్ నటి అని చెప్పాలి. నిక్కీ గల్రానీతో ఆది నిశ్చితార్థం అనంత‌రం ఫోటోషూట్ అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యింది.

నిశ్చితార్థం గురువారం జరిగిందని ఆది శనివారం నాడు అధికారిక‌ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. జీవితంలో ఒకరినొకరు వెతుక్కుని ప‌ట్టుకోవడం చాలా ఉత్త‌మ‌మైనది. మేం కొన్ని సంవత్సరాల క్రితం ఒకరినొకరు కనుగొన్నాం. ఇది ఇప్పుడు అధికారికం! 24.3.2022 మాకు ప్రత్యేకమైనది. మా ఇద్దరి కుటుంబాల సమక్షంలో మేము నిశ్చితార్థం చేసుకున్నాం. ఇక‌పై మేము కలిసి ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నందున‌ మీ అందరి ప్రేమ ఆశీర్వాదాలు కావాలి'' అన్నారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. ఆది ఇటీవల సోనీలైవ్ లో ప్రసారం అవుతున్న క్లాప్ లో కనిపించాడు. 'అజ్ఞాతవాసి'లో పవన్ కళ్యాణ్ కి విలన్ గా నటించాడు. ప్రస్తుతం 'ది వారియర్ 'లో రామ్ పోతినేనికి విలన్ గా నటిస్తున్నారు.

నిక్కీ విషయానికొస్తే.. ఈ ఏప్రిల్ 1న తమిళ చిత్రం 'ఇడియట్' విడుదల కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది. ఇది పేరడీ హారర్ చిత్రం. కెరీర్ ప‌రంగా ఇద్ద‌రికీ ఎలాంటి డోఖా లేదు.