Begin typing your search above and press return to search.
'ప్రాజెక్ట్ కె' పై చెత్త రూమర్లు.. నాగ్ అశ్విన్ దిమ్మతిరిగే కౌంటర్!
By: Tupaki Desk | 15 Sep 2022 6:37 AM GMT'మహానటి' మూవీ తో జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్.. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 'ప్రాజెక్ట్ కె' వర్కింగ్ టైటిల్ తో ప్రారంభమైన ఈ చిత్రం లో ప్రభాస్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే నటిస్తోంది. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, దిశా పటాని తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషిస్తున్నారు.
టైం ట్రావెల్ నేపథ్యంలో అత్యంత భారీ బడ్జెట్ తో ఈ మూవీని రూపొందిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాపై ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది. 'ప్రాజెక్ట్ కె' కథ రీసెంట్ గా విడుదలైన 'ఒకే ఒక జీవితం' మూవీ కథను పోలి ఉంటుంది అన్నదే ఆ వార్త సారాంశం. 'ఒకే ఒక జీవితం' మూవీలో శర్వానంద్, రీతూ వర్మ జంటగా నటించారు. శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించాడు. ఇది కూడా టైం ట్రావెల్ స్టోరీనే. అయితే మదర్ సెంటిమెంట్ ను జోడించి ఈ మూవీని రూపొందించారు.
సెప్టెంబర్ 9న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. అయితే ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ప్రాజెక్ట్ కె కథ కూడా దాదాపు ఇలాగే ఉంటుందని.. ఇప్పుడు ఈ విషయమే మేకర్స్ ను కలవరపెడుతోందంటూ రూమర్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ రూమర్లపై తాజాగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ తనదైన శైలిలో దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు.
'ప్యారడైజ్ వద్ద బస్సు దిగిన వారంతా బిర్యానీ తినరు' అంటూ నాగ్ అశ్విన్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ పెట్టారు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ ను ఎంచుకున్న వారందరి కథలు ఒకేలా ఉండవు అన్నదే నాగ్ అశ్విన్ పోస్ట్ కి అర్థమని నెటిజన్లు భావిస్తున్నారు. మొత్తానికి 'ప్రాజెక్ట్ కె' పై వస్తోన్న చెత్త రూమర్లన్నిటికీ నాగ్ అశ్విన్ పరోక్షంగా చెక్ పెట్టారు.
కాగా, వైజయంతీ మూవీస్ బ్యానర్లపై అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో పాన్ వరల్డ్ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని 2023 అక్టోబర్ 18న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలతో పాటు పలు అంతర్జాతీయ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఒకవేళ ఆ తేదీ కుదరకపోతే 2024 జనవరిలో ప్రాజెక్ట్ కె రిలీజ్ ఉంటుందని ఇప్పటికే అశ్వినీ దత్ వెల్లడించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.