Begin typing your search above and press return to search.

ఏంటిది చెప్మా! తెలుగు హీరోల్ని ఇలా మోసేస్తోంది!!

By:  Tupaki Desk   |   2 Nov 2022 3:30 PM GMT
ఏంటిది చెప్మా! తెలుగు హీరోల్ని ఇలా మోసేస్తోంది!!
X
సెల్ఫ్ ప్ర‌మోష‌న్ తో సెల్ఫ్ మేడ్ స్టార్ గా మారేందుకు కొంద‌రు న‌వ‌త‌రం భామలు సీరియ‌స్ ఎటెంప్ట్స్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కానీ ఇది అంద‌రికీ వ‌ర్క‌వుట్ కాదు. త‌మ గొప్ప‌ల కోసం కొంద‌రు భామ‌లు స్టార్ హీరోలు డైరెక్ట‌ర్ల పేర్ల‌ను కూడా ఇంట‌ర్వ్యూల్లో అడిగినా అడ‌గ‌క పోయినా సెల‌విస్తుంటారు.

ఇలాంటి వారి జాబితాలో బాలీవుడ్ కి చెందిన ఒక అందాల న‌ట‌వార‌సురాలు ముందు వ‌రుస‌లో ఉంద‌న్న‌ గుస‌గుస వినిపిస్తోంది. స‌ద‌రు భామామ‌ణి సౌత్ హీరోల‌ను న‌చ్చిన‌ట్టు వాడకం మొద‌లు పెట్టింద‌ని టాక్ వినిపిస్తోంది. అయిన దానికి కాని దానికి.. అవ‌స‌రం ఉన్నా లేక‌పోయినా ప్ర‌తిసారీ ఎన్టీఆర్ ... అల్లు అర్జున్.. రామ్ చ‌ర‌ణ్ లాంటి స్టార్ల‌ను తెగ పొగిడేస్తోంది. వీళ్ల‌తో ఛాన్స్ వ‌స్తే అస్సలు వ‌దులుకోను! అంటూ ముందే సిగ్న‌ల్స్ ఇచ్చేస్తోంది.

కానీ ఈ అమ్మ‌డు ఇప్ప‌టివ‌ర‌కూ ఒక్క తెలుగు సినిమాకి కూడా క‌మిట‌వ్వ‌లేదు. పైగా సౌత్ హీరోల‌పై ఈ భామ కామెంట్లు ఇక్క‌డ కూడా మీడియాలో వైర‌ల్ అయిపోతుండ‌డంతో సౌత్ లో బోలెడంత ఉచిత‌ ప‌బ్లిసిటీ ద‌క్కుతోంది. నిజానికి స‌ద‌రు కుర్ర‌భామ ఈపాటికే టాలీవుడ్ లో అడుగుపెట్టాల్సింది. కానీ బాలీవుడ్ కెరీర్ ఫుల్ బిజీగా ఉండ‌డంతో సౌత్ ని ఇప్ప‌టికీ లైట్ తీస్కొంటోంది. త‌న వెంట అగ్ర నిర్మాత అయిన‌ పాపా ఉన్నాడు. త‌న కెరీర్ ని డిజైన్ చేసేందుకు ప్ర‌ముఖ ద‌ర్శ‌క‌నిర్మాత కం బాలీవుడ్ డీన్ 24 /7 ప‌ని చేస్తున్నారు.

ప్ర‌ముఖ ఫ్యాష‌న్ డిజైన‌ర్లు త‌న‌ని ఫ్యాష‌న్ ప్ర‌పంచపు క్వీన్ గా మార్చేస్తున్నారు. త‌న‌ని నిత్యం వార్త‌ల్లో ఎలా నిల‌పాలో వీళ్లంతా చాలా ప‌క‌డ్భందీగా డిజైన్ చేసి పుష‌ప్ చేస్తున్నారు. దీంతో ఈ అమ్మ‌డు సినీరంగంలో అడుగుపెట్టిన చాలా త‌క్కువ స‌మ‌యంలో గొప్ప‌గా పాపుల‌రైపోయింది. ఒక సాధార‌ణ న‌టికి న‌ట‌వార‌సురాలికి మ‌ధ్య ఉన్న గ్లింప్స్ లో తేడా ఏంటో ఈ అమ్మ‌డిని చూస్తే ఇట్టే అర్థ‌మైపోతుంది.

ఇక పోటీలో ఎంద‌రు న‌ట‌వార‌సురాళ్లు ఉన్నా నిరంత‌రం అంద‌రినీ డామినేట్ చేస్తూ త‌న‌దైన వ‌స్త్ర‌ధార‌ణ‌... గుబులు రేపే స్టింట్స్ తో కుర్ర‌కారును త‌న‌వైపు తిప్పేసుకుంటోంది. ఇటీవ‌లి కాలంలో జూనియ‌ర్ ఉర్ఫీ జావేద్ అంటూ త‌న‌ని నెటిజ‌నులు ఒక రేంజులో ఆడేసుకుంటున్నారు.

ఏది ఏమైనా స‌ద‌రు కుర్ర‌భామ ప‌బ్లిసిటీ స్టంట్ చాలా తెలివిగా ఉంది. చూస్తుండ‌గానే పాన్ ఇండియా స్టార్ గా ఎదిగేయాల‌ని చాలా పెద్ద గేమ్ ప్లాన్ తో ఉంది. ఇప్ప‌టికిప్పుడు పాన్ ఇండియా స్టార్లు అయిన బ‌న్ని కానీ ఎన్టీఆర్ లేదా చ‌ర‌ణ్ అవ‌కావం ఇస్తే చాలు వెంట‌నే `సై` అనేసేందుకు రెడీ. ప్ర‌భాస్ లాంటి గ్రేట్ స్టార్ లిఫ్టిస్తానంటే ఇక ఏ భామ అయినా ఆ అవ‌కాశాన్ని విడువ‌దు. ఈ జాబితాలో స‌ద‌రు నట‌వార‌సురాలు కూడా ఉందనేది ఒక‌ గుస‌గుస‌. త‌న తండ్రితో క‌లిసి న‌టించిన ప్ర‌యోగాత్మ‌క సినిమా రిలీజ్ ప్ర‌మోష‌న్స్ లో తెలుగు హీరోల‌ను కుర్ర బ్యూటీ మోసేయ‌డం ఇటీవ‌ల టాలీవుడ్ లో రిక‌గ్నైజ్ అయ్యింది!!


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.