Begin typing your search above and press return to search.

కొవిడ్ బాధితుల గొంతు తడిపిన యంగ్ హీరో!

By:  Tupaki Desk   |   4 May 2021 2:30 AM GMT
కొవిడ్ బాధితుల గొంతు తడిపిన యంగ్ హీరో!
X
టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ యాక్ట‌ర్ గా పేరు తెచ్చుకున్న అడ‌వి శేషు.. త‌న‌లో ద‌యాగుణం కూడా ఎక్కువేన‌ని ప‌లుమార్లు చాటుకున్నాడు. తాజాగా.. క‌రోనాతో అల్లాడుతున్న వారికి తాగునీటిని స‌ర‌ఫ‌రా చేసి శెభాష్ అనిపించుకుంటున్నాడు. ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యంవ‌హించినా.. తాను ముందుకొచ్చి స‌హాయం అందించారని ప‌లువురు అభినందిస్తున్నారు.

హైదరాబాద్ లోని కోటి ఆసుపత్రిలో తాగునీటి కొర‌త తీవ్రంగా వేధిస్తోంది. వైద్యులతోపాటు కొవిడ్‌ రోగులు కూడా గొంతు త‌డ‌వ‌క నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నట్టు స‌మాచారం. ఈ విష‌యం తెలుసుకున్న అడ‌వి శేషు.. 850 లీటర్ల ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాట‌ర్ ను అందించారు.

ఈ ఆసుపత్రిలో దాదాపు 300 మంది క‌రోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. తాగునీరు స‌రిప‌డా అందుబాటులో లేక‌పోవ‌డంతో వారు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇక్క‌డ కేవ‌లం మూడు లీట‌ర్ల నీటిని మాత్ర‌మే అందిస్తున్న‌ట్టు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రిగింది. ఈ విష‌యం ట్విట‌ర్ ద్వారా తెలుసుకున్న శేషు.. త‌న స్నేహితుల‌తో క‌లిసి ఈ వాట‌ర్ స‌ర‌ఫ‌రా చేసిన‌ట్టు స‌మాచారం.

అంతేకాకుండా.. ఈ స‌మ‌స్య‌ శాశ్వతంగా పరిష్కారం అయ్యే వరకు తాగునీటిని స‌ర‌ఫ‌రా చేసేందుకు శేషు ముందుకు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. అవసరమైతే మరిన్ని ఏర్పాట్లు చేసేందుకు సైతం హామీ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. దీంతో అడ‌వి శేషు ద‌యార్ధ్ర‌హృద‌యంపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది.