Begin typing your search above and press return to search.
ట్రైలర్: జోయా చెయ్యేస్తే వరల్డ్ కప్ మనదే
By: Tupaki Desk | 29 Aug 2019 3:41 PM GMT25 జూన్ 1983 టీమిండియా ప్రపంచకప్ గెలిచిన సందర్భం అది. కపిల్ సారథ్యంలోని టీమిండియా వరల్డ్ చాంపియన్ ఎలా అయ్యింది? అంటే అది కెప్టెన్ పనితనం వల్ల కాదట. జోయా(సోనమ్) ఫ్యాక్టర్ వల్లనే టీమిండియా గెలిచింది. ఇది ఎంత పెద్ద జోకు అనొద్దు. ఆమె చెయ్యేస్తే అంతే సంగతి. ఇక్కడ జోయా పుట్టింది.. అక్కడ ఇండియా వరల్డ్ కప్ గెలిచిందని ఆమె తండ్రికి బలమైన నమ్మకం. జోయాలో ఏదో సంథింగ్ ఉంది.. అది లక్ ఫ్యాక్టర్ గా కలిసొస్తుందనేది అతడి ఫీలింగ్. క్రికెట్ పిచ్చోడు అయిన జోయా తండ్రి టీమిండియా గెలుపు బాట కోసమే ఎంతో కాలంగా వేచి చూస్తుంటాడు. పేల్చేందుకు తెచ్చి పెట్టుకున్న బాంబులు కూడా ఇంట్లోనే మూలన పడి ఉంటాయి. ఇన్నేళ్లలో ఏనాడూ వాటిని పేల్చే సందర్భం రాలేదు పాపం.
ఇవన్నీ తనకు పరిచయం అయిన దుల్కార్ కి చెబుతుంది జోయా. అయితే అప్పటికే పరాజయాల బాటలో ఉన్న టీమిండియా క్రికెటర్ గా దుల్కార్ చాలానే విసుగెత్తిపోయి ఉంటాడు. మరి జోయా అనే లక్ ఫ్యాక్టర్ అతడికి కలిసొచ్చిందా లేదా? అసలు జోయా ఫ్యాక్టర్ గురించి జ్యోతిష్కులు ఏం చెప్పారు? టీమిండియా గెలిచేస్తే.. అదంతా జోయా ఫ్యాక్టర్ వల్లనేనా? కష్టపడి ప్రయత్నించకుండా ఆటను గెలిచేయడం సాధ్యమేనా? ఇదంతా ఇంట్రెస్టింగ్ డ్రామా అనే చెప్పాలి. జోయా ఫ్యాక్టర్ వల్ల తమ టీమ్ గెలవడమేంటి? అంటూ దుల్కార్ లో మదనం మరో హైలైట్. ఆ ఇద్దరి పరిచయంలో ప్రేమ.. సంఘర్షణ ఏమిటన్నదే జోయా ఫ్యాక్టర్ చిత్రం.
తాజాగా రిలీజైన ట్రైలర్ ఆకట్టుకుంది. ఇందులో టీమిండియా క్రికెటర్ గా నటిస్తున్న దుల్కార్ సల్మాన్ తనని తాను యూనివర్శల్ ఆడియెన్ కి కనెక్టయ్యేలా చేస్తున్నాడు. సోనమ్ మరోసారి ఆసక్తికరమైన పాత్రలో నటిస్తోంది. ప్రాక్టీస్ లేకుండా లక్ తో క్రికెట్ మ్యాచ్ లు గెలవడమా? అన్న ఎలిమెంట్ యూత్ కి కనెక్టయ్యేదే. స్పోర్ట్స్ ఫీవర్ తో వస్తున్న సినిమాల్లో ఇదో డిఫరెంట్ మూవీ అనే చెప్పాలి. ఇందులో అండర్ కరెంట్ గా సెటైర్ ఎలిమెంట్ ఆకట్టుకుంటోంది. దుల్కార్- సోనమ్ జంటగా అభిషేక్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది.