Begin typing your search above and press return to search.
ప్రేక్షకులను థియేటర్స్ కు రప్పించేందుకు కొత్త ప్లాన్లు
By: Tupaki Desk | 9 April 2020 12:30 AM GMTకరోనా సంక్షోభంతో అందరికంటే ఎక్కువగా ప్రభావం పడింది సినిమా రంగంపైనే.. కరోనా లాక్ డౌన్ తో దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లు మరియు మల్టీప్లెక్సులు మూసివేయబడ్డాయి. దీంతో రూపాయి ఆదాయం కూడా సినిమాల నుంచి లేకుండా పోయింది.భారీ నష్టాలు వస్తున్నాయి. చాలా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు అద్దె ఆస్తులు కాబట్టి, అద్దె మరియు నిర్వహణ నిర్వాహకులకు తలకుమించిన భారం అవుతోంది. మాఫీ చేయాలని వాటి లీజుకు తీసుకున్న సినీ వర్గాల వారు యజమానులను కోరుతున్నారు.
అయితే కరోనా అంటు వ్యాధి. లాక్ డౌన్ ముగిశాక కూడా సామూహికంగా కూర్చొని చూసే సినిమా థియేటర్లకు జనాలు వస్తారన్న గ్యారెంటీ లేదు. ప్రజలు రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. లాక్ డౌన్ సడలించిన తర్వాత కూడా థియేటర్స్ - మల్టీప్లెక్స్ కోలుకోవడం సాధారణమైన విషయం కాదు. లాక్ డౌన్ తరువాత కరోనా పూర్తిగా తగ్గిందనుకుంటేనే జనాలు థియేటర్స్ - మాల్స్ కు వస్తారు. అందుకే ప్రేక్షకుల్లో విశ్వాసాన్ని ప్రేరేపించడానికి టికెట్-బుకింగ్ స్థాయిలో సామాజిక దూరాన్ని ప్రవేశపెట్టడానికి మల్టీప్లెక్సులు - సినిమా థియేటర్లు ప్రయత్నాలు ఇప్పటి నుంచే ప్రారంభించాయి.
లాక్ డౌన్ తర్వాత నుంచి ప్రతీ సినిమా థియేటర్ లో ప్రతి సీటు పక్కన ఒక సీటును వదిలి టిక్కెట్లను బుక్ చేసుకునేలా మార్పులు చేయనున్నట్టు తెలిసింది.. మీరు రెండు టిక్కెట్లు బుక్ చేసుకుంటే - మీ మధ్యన ఒక సీటు ఖాళీగా ఉండి తర్వాత సీటును కేటాయిస్తారన్న మాట.. ప్రతీ సీటు మధ్యలో ఒక సీటును ఖాళీగా ఉంచుతారన్నమాట.. థియేటర్ యజమానులకు నష్టాలు వచ్చినప్పటికీ జనాలను థియేటర్స్ కు రప్పించడం కోసం ఇంతకంటే మరో మార్గం లేదని భావిస్తున్నాయి. ఇక థియేటర్స్ లో పరిశుభ్రత - పారిశుధ్య చర్యలు కూడా కఠినంగా అమలు చేయాల్సి ఉంటుంది. అలా అయితేనే ప్రేక్షకులు మళ్లీ సినిమాలు చూసేందుకు వస్తారు.
థియేటర్ల నుంచి పంపిణీదారులు మరియు నిర్మాతల వరకు సినిమా వాణిజ్యంపైనే బతుకుతున్నారు. దీంతో జనాల కోసం కొంత త్యాగం చేయడానికి.. నష్టాలు భరించడానికి కూడా ముందుకు రావాలి. అప్పుడే ప్రేక్షకులు మళ్లీ సినిమా థియేటర్స్ కు వచ్చే వీలుంటుంది. తక్కువ కలెక్షన్లు వచ్చినా ఈ పద్ధతి పాటిస్తేనే బెటర్ అని సూచిస్తున్నారు.