Begin typing your search above and press return to search.

అందరూ థియేటర్‌, ఓటీటీ ల్లో చూశారు.. అక్కడ ఎవరు 'ఆర్ఆర్‌ఆర్‌''ని చూడలేట

By:  Tupaki Desk   |   26 Aug 2022 11:30 AM GMT
అందరూ థియేటర్‌, ఓటీటీ ల్లో చూశారు.. అక్కడ ఎవరు ఆర్ఆర్‌ఆర్‌ని చూడలేట
X
టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్‌ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్ అయ్యి అత్యధిక దేశాల్లో స్ట్రీమింగ్‌ అవుతూ ఒక ఇంగ్లీష్ సినిమా స్థాయిలో నెట్‌ ఫ్లిక్స్ లో అత్యధిక వారాలు ట్రెండ్ అయిన విషయం కూడా తెల్సిందే.

థియేట్రికల్‌ స్క్రీనింగ్ మరియు ఓటీటీ స్ట్రీమింగ్ లో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న ఆర్‌ ఆర్ ఆర్‌ బుల్లి తెర టెలికాస్ట్‌ లో మాత్రం చాలా నిరుత్సాహ పర్చింది. పాతిక వరకు టీఆర్‌పీ రేటింగ్‌ వస్తుందని అభిమానులు మరియు బుల్లి తెర వర్గాల వారు భావించారు. కానీ కనీసం 20 రేటింగ్ కూడా ఈ సినిమా దక్కించుకో కపోవడం హాట్‌ టాపిక్ అయ్యింది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఆర్ ఆర్‌ ఆర్ సినిమా కు 19.62 రేటింగ్ దక్కినట్లుగా తెలుస్తోంది. కనీసం తెలుగు సినిమాల టీఆర్‌ పీ రేటింగ్ టాప్ 10 లో కూడా ఈ సినిమా నిలువలేదు. గీత గోవిందం.. ఫిదా వంటి సినిమాలు 20 కి పైగా రేటింగ్ దక్కించుకుని టాప్ 10 లో నిలిచాయి. కానీ ఆర్ ఆర్ ఆర్‌ సినిమా ను బుల్లి తెరపై వాటి కంటే కూడా చాలా తక్కువ గా జనాలు చూశారు.

ఆర్ ఆర్‌ ఆర్‌ టీఆర్‌పీ రేటింగ్ చాలా తక్కువ రావడానికి ప్రధాన కారణం సినిమా ను మెజారిటీ జనాలు థియేటర్లలో చూశాను.. మిగిలిన వారు ఓటీటీ లో చూశారు. పలు ఓటీటీ ల్లో రావడంతో పాటు పైరసీని కూడా జనాలు చూశారు. అందుకే శాటిలైట్ పై టెలికాస్ట్‌ అయిన సమయంలో జనాలు ఎక్కువగా ఆసక్తి చూపించలేదేమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఎక్కువ శాతం మంది థియేటర్ మరియు ఓటీటీ లో చూడటం వల్ల టీవీ ల్లో తక్కువ మంది చూశారని ఎక్కువ శాతం మంది భావిస్తున్నారు. అయితే సోషల్‌ మీడియాలో మాత్రం ఈ విషయం ప్రముఖంగా చర్చ జరుగుతోంది. మళ్లీ మళ్లీ చూసే ప్రేక్షకులు తెలుగు లో చాలా మంది ఉంటారు. వారు అయినా మళ్లీ మళ్లీ సినిమా ను చూడాలి కదా అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి ఆర్ ఆర్ ఆర్‌ శాటిలైట్‌ రేటింగ్‌ విషయం లో ఎన్టీఆర్‌ మరియు మెగా అభిమానులు ఒకింత నిరాశతోనే ఉన్నారు. కనీసం టాప్ 10 లో అయినా స్థానం దక్కించుకుంటే గౌరవప్రదంగా ఉండేది అనేది వారి యొక్క అభిప్రాయం. ముందు ముందు అయినా ఈ సినిమాకు మంచి రేటింగ్స్ నమోదు అవుతాయేమో చూడాలి.