Begin typing your search above and press return to search.

థియేటర్లు ఓపెన్‌ ఇక 50% ఐనా రియల్‌ వార్తలపై దృష్టి పెట్టండి : తాప్సి

By:  Tupaki Desk   |   4 Oct 2020 6:15 AM GMT
థియేటర్లు ఓపెన్‌ ఇక 50% ఐనా రియల్‌ వార్తలపై దృష్టి పెట్టండి : తాప్సి
X
థియేటర్లను ఓపెన్‌ చేసేందుకు కేంద్రం నుండి అనుమతులు రావడంపై జాతీయ మీడియా భిన్న కథనాలు ప్రచారం చేస్తున్నాయి. కొన్ని మీడియా సంస్థలు 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడిచినా కూడా వైరస్‌ ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉందంటూ అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హీరోయిన్‌ తాప్సి సోషల్‌ మీడియా ద్వారా ఆసక్తికర కామెంట్స్‌ చేసింది. ఏ మీడియా ఛానెల్‌ పేరు ఎత్తకుండా అందరికి కూడా చాలా బలంగా దెబ్బ పడేలా.. అందరికి తగిలేలా తాప్సి కౌంటర్‌ పడింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇంతుకు తాప్సి ట్వీట్టర్‌ లో ఏం ట్వీట్‌ చేసిందంటే... కేంద్ర ప్రభుత్వ అనుమతులతో థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతో ఓపెన్‌ కు సిద్దం అవుతున్నాయి. ఈ సమయంలో కొన్ని మీడియా సంస్థలు నిజమైన వార్తల వైపు దృష్టి సారించాలి. కనీసం 50 శాతం అయినా రియల్‌ వార్తలను మీడియా అందించాలంటూ ఆమె విజ్ఞప్తి చేసింది. థియేటర్లు లేని ఇన్ని రోజులు మీరు ప్రేక్షకులను మీ వార్తలతో బాగా ఎంటర్‌ టైన్‌ చేసినందుకు కృతజ్ఞతలు అంటూ గత కొన్ని రోజులుగా జాతీయ మీడియాలో వస్తున్న బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు మరియు ఇతరత్ర వార్తలకు తాప్సి గట్టి కౌంటర్‌ ఇచ్చింది. నిజంగానే జాతీయ మీడియా గత కొన్ని రోజులుగా చాలా ఎంటర్‌ టైన్‌ చేశాయంటూ తాప్సి పోస్ట్‌ కు జనాలు కామెంట్స్‌ చేస్తున్నారు. థియేటర్లు ఓపెన్‌ అవుతున్నాయి కనుక వారు తాప్సి అన్నట్లుగా 50 శాతం అయినా రియల్‌ వార్తలపై దృష్టి పెడితే బాగుంటుంది.