Begin typing your search above and press return to search.

# క‌రోనా: మార్చి 31వ‌ర‌కూ థియేట‌ర్ల బంద్ కు ఫిక్స్

By:  Tupaki Desk   |   20 March 2020 12:10 PM GMT
# క‌రోనా: మార్చి 31వ‌ర‌కూ థియేట‌ర్ల బంద్ కు ఫిక్స్
X
క‌రోనా క‌ల్లోలం ప్ర‌పంచ మార్కెట్ల‌ను అత‌లాకుత‌లం చేసిన సంగ‌తి తెలిసిందే. ఎక్క‌డి ప‌నులు అక్క‌డ ఆగిపోయాయి. ర‌వాణా వ్య‌వ‌స్థ స్తంబించి పోయింది. ఈ శ‌తాబ్ధంలోనే ఇంత‌టి ప్ర‌మాద‌క‌ర‌మైన మ‌రో వైర‌స్ ఇంకేదీ లేద‌ని డిక్లేర్ చేసిన ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ హై అలెర్ట్ ప్ర‌క‌టించ‌డం అటుపై అన్ని దేశాల్లోనే రెడ్ అలార్మ్ మోగిపోవ‌డం తెలిసిందే. ఇక ఈ ప్ర‌భావం అన్ని మార్కెట్లు.. వ్యాపారాల‌ తో పాటు వినోద‌రంగంపైనా అంతే దారుణంగా ప‌డింది. ఇండియ‌న్ సినిమా కుదేలైపోయింది. ఇక టాలీవుడ్ లోనూ ప‌రిస్థితి ఎంతో ధైన్యంగా ఉంది.

సినిమా తెర‌కెక్కి అన్ని ఫార్మాల్టీస్ పూర్త‌యినా రిలీజ్ చేయ‌లేని ప‌రిస్థితి. అప్ప‌టికే ఆడుతున్న సినిమాని ఆడ‌నివ్వ‌లేని ప‌రిస్థితి. థియేట‌ర్లు ష‌ట్ డౌన్. షూటింగులు బంద్. ఇది అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిగా మారింది. ఇక థియేట‌ర్ల బంద్ వ‌ల్ల ఎగ్జిబిట‌ర్ రంగం కుదేలైపోయే ప‌రిస్థితి ఉంది. అయినా ప‌రిశ్ర‌మ 24 శాఖ‌లు తెలంగాణ‌- ఆంధ్ర ప్రభుత్వాల నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి ఉన్నాయి. ఎగ్జిబిట‌ర్లు.. పంపిణీ వ‌ర్గాలు.. నిర్మాత‌లు థియేట‌ర్ల బంద్ కి స‌హ‌క‌రిస్తున్నారు.

మొన్న‌టికి మొన్న ఈనెల 21 వ‌ర‌కూ థియేట‌ర్ల బంద్ నిర్ణ‌యాన్ని ప‌రిశ్ర‌మ పెద్ద‌లు అధికారిక స‌మావేశం అనంత‌రం ప్ర‌క‌టించారు. క‌రోనా క‌ల్లోలం ఆగేవ‌ర‌కూ త‌మ‌వంతు స‌హ‌కారం ఉంటుంద‌ని తెలిపారు నేడు మ‌రోసారి హైద‌రాబాద్ లో క‌రోనా పై 24 క్రాఫ్టుల స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో థియేట‌ర్ల బంద్ ను.. షూటింగుల బంద్ ను ఈనెల 31 వ‌ర‌కూ పొడిగించాల‌న్న నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. ఆ మేర‌కు నిర్మాత‌ల మండ‌లి - మా అసోసియేష‌న్ వ‌ర్గాలు స‌హా కీల‌క పెద్ద‌ల నుంచి అధికారికంగా ప్రెస్ నోట్ అందింది. అంటే రెండు వారాల పాటు ఫుల్ గా బంద్ పాటిస్తున్న‌ట్టే. ఇక మార్చి 31 నాటికి క‌రోనా మ‌హ‌మ్మారీ ప‌రిస్థితి ఎలా ఉండ‌నుందో రివ్యూ చేసి అప్పుడు నిర్ణ‌యించుకునే అవ‌కాశం ఉంది. అయితే క‌రోనా ముప్పు ఇప్ప‌ట్లో ఆగేట్టు లేదు. ఏప్రిల్ లోనూ కొన‌సాగితే సంపూర్ణంగా నెల‌రోజుల పాటు బంద్ కి ఆస్కారం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇది పెనువిల‌యం లాంటిది. మ‌నిషి ఊహ‌కంద‌నంత ప్ర‌మాద‌క‌రంగా ఉంద‌న్న సంకేతం అందింది. దేశంలో తెలుగు రాష్ట్రాల్లో అధికారికంగా పాజిటివ్ కేసులు వంద‌ల ప‌దులు సంఖ్య‌లోనే అయినా ఈ మ‌హ‌మ్మారీ అమాయ‌క ప్ర‌జ‌ల‌కు తెలియ‌కుండా ఏ మేర‌కు పాకుతోందోన‌న్న ఆందోళ‌న నెల‌కొంది. అందుకే ఇప్పుడు సినీప‌రిశ్ర‌మ సైతం క‌రోనా ముందు మోక‌రిల్లింద‌ని చెప్పాలి.