Begin typing your search above and press return to search.
'ఎఫ్-3'కి ముందుంది అగ్ని పరీక్షేనా?
By: Tupaki Desk | 29 May 2022 12:30 PM GMT'ఎఫ్ -3' ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. పాత టిక్కెట్ ధరలతోనే రెండు రాష్ర్టాల్లో సినిమా రిలీజ్ అయింది. ప్రేక్షకులపై ప్రేమతోనో..మరో కారణంతోనో తెలియదుగానీ..రాజుగారు తక్కువ టిక్కెట్ ధరకే ఎఫ్ -3తో ఎంటర్ టైన్ మెంట్ అందించాలని డిసైడ్ అలాగే వచ్చేసారు. సినిమాకి మౌత్ టాక్ బాగానే ఉంది.
రివ్యూలు బాగానే వచ్చాయి. 'ఎఫ్ -2' సక్సెస్ ఫుల్ ప్రాంచైజీ నేపథ్యంలో 'ఎఫ్-3'కి భారీగానే ఓపెనింగ్స్ వచ్చాయి. మొదటి..రెండవ రోజు థియేటర్ ఆక్యుపెన్సీ బాగానే ఉంది. ఆదివారం కూడా స్థిరంగానే వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. తొలి రోజు 9 కోట్లు షేర్..మలి రోజు 8.5 కోట్ల షేర్ తో రెండు రోజుల షేర్ బాక్సాఫీస్ వద్ద జోరు బాగానే ఉందనిపించింది.
ఆదివారం కూడా అదే స్థాయిలో షేర్ ఉండే అవకాశం ఉంటుందనడంలో సందేహం లేదు. మొత్తంగా వీకెండ్ షేర్ 25 కోట్లు దాకా ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ఈ జోరు సరిపోదు. 'ఎఫ్ -3' వేగం పెంచాల్సిన అవసరం ఎంతైన ఉందన్నది ట్రేడ్ మాట. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ 80 కోట్ల వరకూ జరిగింది. బయ్యర్లు లాభ పడాలంటే లాంగ్ రన్ తప్పని సరి.
అంటే ఇప్పుడు వచ్చిన వసూళ్లకి ఇంకా రెండు రెట్లు షేర్ రాబట్టాలి. అప్పుడే బయ్యర్లు సేఫ్ జోన్ లో కి వెళ్లినట్టు. అది జరగాలంటే ఎఫ్ -3 మూడవ వారం వరకూ యధావిధిగా ఇదే రేంజ్ వసూళ్లతో ముందుకు వెళ్లగలగాలి. మరి ఈ సినిమాకి అంత సత్తా ఉందా? అంటే చెప్పలేని పరిస్థితి ఉంది. ఇది పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్. వినోద ప్రియులు-ఫ్యామిలీ ఆడియన్స్ల ని మాత్రమే ఎంటర్ టైన్ చేస్తుంది.
ఓ సెక్షన్ ఆడియన్స్ ఇలాంటి సినిమాలకు దూరంగా ఉంటారు. మల్టీప్లెక్స్ ల్లో వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు. ఇలాంటి సినిమాలకి బీసీ సెంటర్లే కీలకం. రాజుగారు టార్గెట్ కూడా వాళ్లే. అయితే మరో మూడు వారాల పాటు ఇదే రకమైన ఆక్యుపెన్సీ ఉంటుందా? అన్నదే సందేహం.
దీనికి తోడు వచ్చే వారం 'మేజర్'..'విక్రమ్' సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటి రాకకు కొన్ని థియేటర్లు 'ఎఫ్ -3' క్లియర్ చేయాల్సి ఉంది. అది జరిగితే వసూళ్ల పై ప్రభావం పడుతుంది. మరి ఇలాంటి పోటీని తట్టుకుని 'ఎఫ్ -3' ఎలా ముందుకెళ్తుందన్నది చూడాలి.