Begin typing your search above and press return to search.
బొమ్మ పడబోతుంది.. టికెట్లు తెగేనా? లేదా?
By: Tupaki Desk | 29 July 2021 2:30 PM GMTకరోనా కారణంగా గత ఏడాది మార్చిలో మూత పడ్డ థియేటర్లు నవంబర్ డిసెంబర్ లో మొదలు అయ్యాయి. జనవరి ఫిబ్రవరిలో పికప్ అందుకుంటున్న సమయంలో సెకండ్ వేవ్ అంటూ మళ్లీ ఏప్రిల్ లో థియేటర్లు మూత పడ్డాయి. ఈసారి మూడు నెలలకే రీ ఓపెన్ అయ్యాయి. సెకండ్ వేవ్ ప్రభావం కూడా అంతగా లేదు. కరోనా కేసులు తక్కువగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రేపటి నుండి థియేటర్లలో సందడి ఎలా ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మూడు నెలల తర్వాత థియేటర్లు పునః ప్రారంభం అవుతున్న నేపథ్యంలో సినీ ప్రియులు ఖచ్చితంగా థియేటర్ల ముందు క్యూ కట్టే అవకాశం ఉందని అంతా నమ్మకంగా ఉన్నారు. ఇండస్ట్రీకి ఇది మరో ఆరంభం అన్నట్లుగా చాలా మంది రేపటి కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
రేపు థియేటర్లలో బొమ్మ పడటం ఖాయం అయ్యింది. సత్యదేవ్ నటించిన తిమ్మరుసు మరియు తేజ సజ్జా నటించిన ఇష్క్ సినిమాలు ప్రేక్షకులమ ఉందుకు రాబోతున్నాయి. సెకండ్ వేవ్ తర్వాత రాబోతున్న ఈ సినిమాల కోసం ప్రేక్షకులు థియేటర్లు వస్తారా అంటే మొదట కొందరు అనుమానం వ్యక్తం చేసినా కూడా రెండు సినిమాల యూనిట్ సభ్యులు కూడా పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేయడం వల్ల ఖచ్చితంగా థియేటర్ల వద్దకు జనాలు రావడం ఖాయం అంటున్నారు. ఒక్కసారిగా భారీ ఎత్తున వచ్చే అవకాశం లేకున్నా కూడా మొదటి రోజు మరియు వీకెండ్స్ అంటే రేపటి నుండి ఆదివారం వరకు మూడు రోజుల పాటు థియేటర్ల వద్ద జన కళ ఖాయం అంటున్నారు. రేపు ఈ సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే అడ్వాన్స్ బుకింగ్ లు శని ఆదివారాలకు దొరకకుండా పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ప్రస్తుతానికి అడ్వాన్స్ బుకింగ్ ల విషయంలో నిరాశ ఉన్నా కూడా రేపు ఉదయం థియేటర్ల వద్ద జనాలు కనిపించడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గల వారు నమ్మకంగా వెయిట్ చేస్తున్నారు. థియేటర్లు పునః ప్రారంభం కోసం ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్న ఈ సమయంలో కాస్త పెద్ద సినిమాలు క్రేజ్ ఉన్న హీరోల సినిమాలు వచ్చి ఉంటే బాగుండేది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాలకు వచ్చే స్పందనను బట్టి వచ్చే నెలలో చిన్న పెద్ద సినిమాలు చాలా వరకు ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయం అంటున్నారు.
తిమ్మరుసు మరియు ఇష్క్ సినిమాలు టాలీవుడ్ కు మళ్లీ జోష్ ను తీసుకు వస్తాయా లేదంటే సందడి కనిపించాలంటే మరి కొన్నాళ్లు వెయిట్ చేయాలా అనేది మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది. ఈ నెల ఆరంభం నుండే సినిమా థియేటర్లు రన్ చేయాలనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సినీ ప్రియులు థియేటర్లు ఓపెన్ చేయాలంటూ డిమాండ్ చేస్తూ వచ్చారు. ఇండస్ట్రీ వర్గాల వారు కూడా థియేటర్ల విషయంలో ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎట్టకేలకు రేపు బొమ్మ పడబోతుంది. ఇక థియేటర్ల వద్ద టికెట్లు తెగుతాయా.. జనాల హడావుడి ఉంటుందా అనేది చూడాలి.