Begin typing your search above and press return to search.
మహేష్ బన్నీలకు థియేటర్ల లొల్లి?
By: Tupaki Desk | 9 Sep 2019 2:30 PM GMTఎంత సంక్రాంతి సీజనైనా ఒకేసారి ఇద్దరు ముగ్గురు స్టార్లు తలపడాల్సి వచ్చినప్పుడు థియేటర్ల సమస్య ఎంత లేదనుకున్నా వస్తూనే ఉంటుంది. అందులోనూ వీటి వ్యవహారాల్లో కీలకంగా ఉండే నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు తీసుకునే నిర్ణయం మార్కెట్ ని ప్రభావితం చేస్తుంది. రాబోయే 2020 సంక్రాంతికి పెద్ద చిక్కే వచ్చేలా ఉంది. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరుతో అల్లు అర్జున్ అల వైకుంఠపురములో ఇప్పటికీ పండక్కు కర్చీఫ్ వేసేశాయి.
డేట్లు ప్రకటించలేదు కాని వాటికి సంబంధించిన చర్చల్లోనే మధ్యలో దిల్ రాజు అటు ఇటు సతమతవుతున్నట్టు సమాచారం. మహేష్ మూవీ నిర్మాతల్లో దిల్ రాజు ఒకరన్న సంగతి తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు ముందు సరిలేరు నీకెవ్వరు రిలీజ్ చేయాలనీ అనుకుంటున్నారట. ఒక రెండు మూడు రోజులు గ్యాప్ ఇచ్చి అల వైకుంఠపురములో విడుదల చేస్తే ఇద్దరికీ ఓపెనింగ్స్ పరంగా ఎలాంటి చిక్కు ఉండదని ప్రతిపాదన పెట్టారట.
అయితే అల్లు కాంపౌండ్ మాత్రం ఒక్క రోజు అయితే వెయిట్ చేయగలమని పండగ రోజు నాడే రిలీజ్ చేస్తే ముందు సెలవు రోజులు మిస్ అవుతాయని దాని వల్ల ఓవరాల్ ఫిగర్స్ లో తేడా వస్తుంది కాబట్టి అలా వద్దని చెబుతున్నారట. ఇది అంత ఈజీగా తేలేలా కనిపించడం లేదు. ప్రిన్స్ సినిమాకు మొదటి మూడు రోజులు చాలా కీలకం కాబట్టి ఆ స్పాన్ వదిలేద్దామని దిల్ రాజు చెబుతున్నా అదే అడ్వాంటేజ్ తాము మాత్రం ఎందుకు కోల్పోవాలని గీత ఆర్ట్స్ ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. మొత్తానికి బయటికి కనిపించని ఈ గొడవ తెగడానికి కొంత టైం అయితే పట్టేలా ఉంది