Begin typing your search above and press return to search.
థియేటర్స్ తెరవడం - సినిమాల విడుదలపై టాలీవుడ్ ప్రముఖుల సమావేశం...?
By: Tupaki Desk | 12 Oct 2020 9:50 AM GMTకేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 15 నుంచి థియేటర్స్ మరియు మల్టీప్లెక్సులు తెరచుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 50 శాతం ఆక్యుపెన్సీతో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రీ ఓపెన్ చేసుకోవచ్చునని సూచించింది. సినిమా థియేటర్స్ పాటించాల్సిన నియమ నిబంధనలు.. ప్రతి షోకు యాజమాన్యం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ప్రకటించింది. దీంతో ఏడు నెలలుగా మూతబడిపోయి ఉన్న సినిమా హాళ్లు తెరుచుకోనున్నాయని అనుకుంటున్నారు. అయితే అక్టోబర్ 15 నుంచి థియేటర్స్ తెరవడానికి తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిబిటర్లు వెనుకాడుతున్నారని తెలుస్తోంది. కాకపోతే దీపావళి సీజన్ లో థియేటర్స్ తెరిచేందుకు ప్రయత్నిస్తామని కొందరు చెప్తున్నారు. ఇప్పటికే కాకినాడ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఈ మేరకు నిర్ణయం కూడా ప్రకటించింది.
అయితే ఎగ్జిబిటర్స్ ఇలా ఆలోచించడానికి తెలుగు రాష్ట్రాలలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటం ఒక కారణమైతే.. ప్రముఖ చిత్రాలేవీ రిలీజ్ కి రెడీగా లేకపోవడం మరో కారణమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాతలు మరియు కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ - ఎగ్జిబిటర్స్ కలిసి ఈ వారాంతంలో హైదరాబాద్ లో సమావేశం కానున్నారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెంబెర్స్.. ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు కూడా హాజరయ్యే ఈ సమావేశంలో థియేటర్లను తిరిగి ప్రారంభించడం గురించి చర్చించనున్నారని తెలుస్తోంది. అలానే సినిమాల రిలీజులపై కూడా డిస్కషన్ జరుగుతుంది. ఈ సమావేశంలో లాక్ డౌన్ సమయంలో థియేటర్ల విద్యుత్ ఫిక్సెడ్ చార్జీలు మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరడంపై కూడా చర్చించనున్నారు. ఈ మీటింగ్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు థియేటర్స్ రీ ఓపెన్ చేస్తారు.. ఏ సినిమాలు ముందుగా ప్రదర్శిస్తారు అనే విషయాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.